తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఓటీటీలో ఈవారం చూడాల్సిన 8 సినిమాలు- 3 తెలుగు, 4 డబ్బింగ్ మూవీస్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

OTT Movies This Week: ఓటీటీలో ఈవారం చూడాల్సిన 8 సినిమాలు- 3 తెలుగు, 4 డబ్బింగ్ మూవీస్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

Sanjiv Kumar HT Telugu

09 September 2024, 13:28 IST

google News
  • OTT Movies Web Series Releases This Week: ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీసులు 9గా ఉన్నాయి. వాటిలో ఏకంగా 8 సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. వీటిలో మూడు తెలుగు చిత్రాలు కాగా.. మిగతావి చాలా వరకు డబ్బింగ్‌లో ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అందులో హారర్ నుంచి కామెడీ వరకు అన్ని జోనర్స్ ఉన్నాయి.

ఓటీటీలో ఈవారం చూడాల్సిన 8 సినిమాలు- 3 తెలుగు, 4 డబ్బింగ్ మూవీస్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!
ఓటీటీలో ఈవారం చూడాల్సిన 8 సినిమాలు- 3 తెలుగు, 4 డబ్బింగ్ మూవీస్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

ఓటీటీలో ఈవారం చూడాల్సిన 8 సినిమాలు- 3 తెలుగు, 4 డబ్బింగ్ మూవీస్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

OTT Movies Web Series This Week: ఓటీటీల హవా పెరిగినప్పటి నుంచి సినిమాలు, వెబ్ సిరీసులు చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ కంటెంట్ చూసేంత వెసులుబాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందించాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వీక్షకులకు విభిన్న కంటెంట్ అందిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను ఈ ఓటీటీల్లో ఎంచక్కా చూసి ఆనందించొచ్చు. వివిధ భాషల్లోనే కాకుండా పలు జోనర్స్‌లలో సినిమాలు, వెబ్ సిరీసులు ప్రతి వారం వస్తూ అలరిస్తున్నాయి. మరి ఈవారం ఓటీటీల్లో చూసే సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో లుక్కేద్దాం.

తలవన్ ఓటీటీ

క్రైమ్ మర్డర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన మలయాళ మూవీ 'తలవన్' సెప్టెంబర్ 10 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో లోకల్ పోలీసులు చేసే మర్డర్ ఇన్వెస్టిగేషన్‌, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో బిజు మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించారు.

కమిటీ కుర్రోళ్లు ఓటీటీ

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక వారి మధ్య ఏర్పడే సంబంధాలు, మనస్పర్థల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించిన కమిటీ కుర్రోళ్లు ఈటీవీ విన్‌లో సెప్టెంబర్ 11న ఓటీటీ రిలీజ్ కానుంది.

మిస్టర్ బచ్చన్ ఓటీటీ

మాస్ మహారాజా రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'మిస్టర్ బచ్చన్'. స్టార్ హీరో అజయ్ దేవగన్ 2018లో నటించిన హిందీ చిత్రం 'రైడ్'కి రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. దీంతో సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మిస్టర్ బచ్చన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో రవితేజతోపాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు, ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2

మంచి సక్సెస్ సాధించిన ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4కు పార్ట్ 2గా వచ్చిన 'ఎమిలీ ఇన్ పారిస్'లో లిల్లీ కాలిన్స్, లూకాస్ బ్రావో, లూసీన్ లావిస్‌కౌంట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఎమిలీ కూపర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా తన డ్రీమ్ జాబ్‌ను ప్రారంభించిన తర్వాత పారిస్‌కు వెళ్లి పని, స్నేహితులు, ప్రేమలో నిమగ్నమవుతుంది. ఈ పార్ట్ 2 సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

బెర్లిన్ ఓటీటీ

క్రైమ్ అండ్ స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన హిందీ చిత్రం 'బెర్లిన్'. ఈ సినిమా 1990ల న్యూ ఢిల్లీ నేపథ్యంలో విదేశీ గూఢచారి అనే అనుమానంతో ఓ చెవిటి-మూగ వ్యక్తిని అరెస్టు చేయడం చుట్టూ తిరుగుతుంది. అతుల్ సబర్వాల్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపరశక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్, అనుప్రియ గోయెంకా, కబీర్ బేడీ నటించారు. బెర్లిన్ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 13న డిజిటల్ ప్రీమియర్ కానుంది.

మొత్తం 9

ఇవే కాకుండా.. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 13న యాక్షన్ కామెడీ మూవీ ఆఫీసర్ బ్లాక్ బెల్ట్, క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సెక్టార్ 36 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అలాగే, లేట్ నైట్ విత్ డెవిల్ అనే హారర్ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. వీటితోపాటు సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ కామెడీ మూవీ ఆయ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇలా ఈ వారం తొమ్మిది ఓటీటీ సినిమాలు చూడాల్సినవిగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం