Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- 6 ఇంట్రెస్టింగ్- 2 హారర్, ఒక క్రైమ్ థ్రిల్లర్ మరీ స్పెషల్!
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 30) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 10 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే వాటిలో రెండు హారర్, అడ్వెంచర్ సినిమాలతోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయంటే..
Today OTT Releases: ఈ వారం ఓటీటీలో 15 లోపు సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఎప్పటిలానే ఎక్కువగా రిలీజ్ అయ్యే శుక్రవారం నాడు అంటే ఇవాళ (ఆగస్ట్ 30) పది ఓటీటీ స్ట్రీంగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా ఆరు వరకు స్పెషల్ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఐసీ814 ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
టర్మినేటర్ జీరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
బడ్డీ (తెలుగు మూవీ)- ఆగస్ట్ 30
ది డెలివరెన్స్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 30
జీ5 ఓటీటీ
ఇంటరాగేషన్ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 30
ముర్షిద్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
బ్యాడ్ న్యూజ్ (హిందీ సినిమా)- ఆగస్ట్ 30
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 30
ది సెప్రెంట్ క్వీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
జియో సినిమా ఓటీటీ
గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్ట్ 29
క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
నిళల్ (తమిళ హారర్ మూవీ, తెలుగులో నీడ)- ఆహా తమిళ ఓటీటీ- ఆగస్ట్ 30
కానా కానుమ్ కాలంగల్ సీజన్ 3 (తమిళ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 30
అడ్వెంచర్ అండ్ హారర్ ఓటీటీ
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 10 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు అడ్వెంచర్ మూవీగా వచ్చిన బడ్డీ స్పెషల్ కానుంది. అల్లు శిరీష్ హీరోగా చేసిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. హాలీవుడ్ హారర్ మూవీ ది డెలివరెన్స్ కూడా ఇంట్రెస్ట్ సినిమా కానుంది.
పదింట్లో ఆరు స్పెషల్
అలాగే, హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ముర్షిద్, క్యాడేట్స్ సిరీస్ సైతం ప్రేక్షకులకు మంచి వినోదం పంచనున్నాయి. ఇక యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నటించిన బ్యాడ్ న్యూజ్ కూడా ఇవాళ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అవనుంది. నయనతార యాక్ట్ చేసిన హారర్ చిత్రం నిళల్ (తెలుగులో నీడ) సైతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇలా ఇవాళ వచ్చిన పదింట్లో ఆరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయనున్నాయి.