OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే చూడాలంటే?-goli soda rising ott streaming on disney plus hotstar tamil crime thriller web series goli soda rising telugu teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే చూడాలంటే?

OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 29, 2024 04:15 PM IST

Goli Soda Rising OTT Streaming: తమిళంలో బాగా హిట్ అయిన సినిమా సిరీస్ గోలీ సోడా. ఈ సిరీస్ నుంచి వస్తోన్న మూడో పార్ట్‌ గోలీ సోడా రైజింగ్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గోలీ సోడా రైజింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!

ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే చూడాలంటే?
ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే చూడాలంటే?

Goli Soda Rising OTT Release: తమిళం చిత్ర పరిశ్రమలో భారీ విజయం అందుకున్న సినిమా ఫ్రాంఛైజీ గోలీ సోడా. ఈ సిరీస్ నుంచి ఇప్పటికీ రెండు మూవీస్ వచ్చాయి. 2014లో గోలీ సోడా విడుదలై మంచి విజయం సాధించగా.. 2018లో గోలీ సోడా 2 రిలీజ్ అయి హిట్ తెచ్చుకుంది.

7.7 రేటింగ్

పాపులర్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన గోలీ సోడా చిత్రానికి ఐఎమ్‌డీబీలో పదికి 7.7 రేటింగ్ ఉండగా.. రెండో పార్ట్ గోలీ సోడా 2 సినిమాకు 7 రేటింగ్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రెండు సినిమాలు తమిళనాట ఎంత పెద్ద హిట్ సాధించాయో. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీ నుంచి మూడో పార్ట్ రానుంది.

అయితే, ఈసారి సినిమాను కాకుండా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు డైరెక్టర్ విజయ్ మిల్టన్. దీనికి గోలీ సోడా రైజింగ్ అని టైటిల్ ఖరారు చేశారు. గోలీ సోడా, గోలీ సోడా 2 సినిమాల్లోని సంఘటనలు, రెండింకి సంబంధించిన కథతో ఈ గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు.

అయితే, ఇటీవల గోలీ సోడా రైజింగ్ టీజర్‌ను తమిళంలో విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ (ఆగస్ట్ 29) గోలీ సోడా రైజింగ్ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఫాస్ట్ కట్‌లో టీజర్

యువత గుంపు, పోలీసులు, క్రైమ్, గొడవలు, యాక్షన్స్ వంటి సన్నివేశాలను ఫాస్ట్ కట్‌లో చూపిస్తూ గోలీ సోడా రైజింగ్ టీజర్‌ను వదిలారు. ఇంట్రెస్టింగ్‌గా సాగిన టీజర్‌ ఎండింగ్‌లో ఏం జరిగినా మనమంతా కలిసే ఉందాం అనే డైలాగ్ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. అయితే, వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా ఉండేందుకు ఇలా ఫాస్ట్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఏడు భాషల్లో రానున్నట్లు తాజాగా తెలుగు ట్రైలర్‌ ద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. గోలీ సోడా రైజింగ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాళీ భాషల్లో అందుబాటులోకి రానుంది. 

కానీ, ఈ గోలీ సోడా రైజింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. తెలుగు టీజర్ కూడా హాట్ స్టార్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ట్రైలర్ తర్వాత, లేదా అందులో వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ వెబ్ సిరీసులో కిషోర్, శ్రీరామ్, పాండి, మురుగేష్‌, చేరన్, జాన్ విజయ్, షామ్, పుగజ్, అవంతిక, అమ్ము, రమ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తర్వాత - ముందు

గోలీ సోడా రైజింగ్ వెబ్ సిరీస్‌ను గోలీ సోడా 1కి సీక్వెల్‌గా, రెండో భాగమైన గోలీ సోడా 2కి ప్రీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. అంటే గోలీ సోడాకు తర్వాత, గోలీ సోడా 2కి ముందు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ డైరెక్టర్ ఇటీవల విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన మజై పిడిక్కత మనిథన్‌ (తెలుగులో తుఫాన్) మూవీని తెరకెక్కించారు.