OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!-ott web series on politics mirzapur ott streaming maharani digital premiere paatal lok ott release best web series list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ott Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

Aug 23, 2024, 03:47 PM IST Sanjiv Kumar
Aug 23, 2024, 03:47 PM , IST

OTT Web Series On Politics: ఓటీటీల్లో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తుంటాయి. అలా ఆధిపత్యం, రాజకీయాలపై తెరకెక్కిన వెబ్ సిరీసులు ఎన్నో ఉన్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ది బెస్ట్ పొలిటికల్ ఓటీటీ వెబ్ సిరీసుల గురించి తెలుసుకుందాం. వాటిలో దేవర విలన్ సైఫ్ అలీఖాన్ తాండవ్ ఉంది.

ప్రతి ఒక్కరూ రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. అలా చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకున్నా, చేసుకోకున్నా, తెలియకపోయినా రాజకీయాలపై పూర్తి ఆసక్తి చూపిస్తారు. మీకు ఇలాంటి ఆసక్తి ఉంటే మీరు ఒకసారి తప్పక చూడాల్సిన రాజకీయాలపై తెరకెక్కిన బెస్ట్ వెబ్ సిరీస్ లను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

(1 / 8)

యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన 'ఆశ్రమం' నుంచి వచ్చిన మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రజల మూఢనమ్మకాలే కాదు, చాలా డర్టీ పాలిటిక్స్ కూడా కనిపిస్తాయి. ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ సిరీస్ ను వీక్షించవచ్చు.

(2 / 8)

సిటీ ఆఫ్ డ్రీమ్స్ వెబ్ సీరిస్‌లో ప్రియా బాపట్, అతుల్ కులకర్ణి, అజాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీని నుంచి రెండు సీజన్లు వచ్చాయి. ఈ సిరీసును మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.

(3 / 8)

మీకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే 'ది బ్రోకెన్ న్యూస్' తప్పక చూడాల్సిందే. ఇందులో నటించిన శ్రియా పిల్గావ్కర్, జైదీప్ అహ్లావత్ ల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సోనాలి బింద్రే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. మీడియా, ఆధిపత్యం, రాజకీయాల నేపథ్యంతో సాగే ఈ సిరీసులు జీ5లో చూడొచ్చు.

(4 / 8)

బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి నటించిన 'మహారాణి' మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ను మీరు సోనీ లివ్ లో వీక్షించవచ్చు. రాజకీయాలు, ఆధిపత్య పోరే ప్రధానంగా సాగే ఈ సిరీస్ మంచి విజయం అందుకుంది. 

(5 / 8)

మీర్జాపూర్ నుంచి మూడు సీజన్లు ఇప్పటివరకు విడుదలయ్యాయి. ఈ సిరీస్ ప్రజలకు బాగా నచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలకు సంబంధించిన ప్రతి కోణాన్ని ఇందులో చూడొచ్చు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. 

(6 / 8)

జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ నటించిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కూడా చాలా మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్.

(7 / 8)

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోని విలన్ సైఫ్ అలీ ఖాన్ తొలిసారి ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ 'తాండవ్'. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు, ఇందులో రాజకీయాలకు సంబంధించిన స్టూడెంట్స్ కోణాలను చూపించారు, ఇది కచ్చితంగా అలరించే వెబ్ సిరీస్. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు