Munjya Review: ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-munjya review in telugu horror comedy ott movie munjya explained in telugu and ott release on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Munjya Review: ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Munjya Review: ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 28, 2024 02:48 PM IST

Horror Comedy Movie Munjya Review In Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ మూవీ ముంజ్య మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అభయ్ వర్మ, శార్వరి వాఘ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్య రివ్యూలో చూద్దాం.

ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
ముంజ్య రివ్యూ.. పెళ్లి కోసం బ్రహ్మ రాక్షసుడి ఆరాటం.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: ముంజ్య

నటీనటులు: శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్, సుహాస్ జోషి, మోనా సింగ్, భాగ్యశ్రీ లిమాయే, శృతి మరాఠే, అజయ్ పుర్కర్ తదితరులు

కథ: యోగేష్ చండేకర్, నిరేన్ భట్

దర్శకత్వం: ఆదిత్య సర్పోత్‌దార్

నిర్మాతలు: దినేష్ విజన్, అమర్ కౌశిక్,

సంగీతం: సచిన్ సంఘ్వి, జిగర్ సాయ్య, జస్టిన్ వర్గీస్

నిర్మాణ సంస్థ: నక్షత్ర్ ఫిల్మ్ ల్యాబ్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఓటీటీ రిలీజ్ డేట్: ఆగస్ట్ 25, 2024

Munjya Movie Review In Telugu: హారర్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఇక ఈ హారర్ సినిమాలకు కామెడీని యాడ్ చేసి కరెక్ట్ థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రన్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్టు. అలా రీసెంట్‌గా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ మూవీనే ముంజ్య.

రూ. 30 కోట్లతో తెరకెక్కిన ముంజ్య సినిమా జూన్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్‌దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సడెన్‌గా ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్య రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

70 ఏళ్ల క్రితం కొంకణ్ అనే గ్రామంలో తనకంటే వయసులో పెద్దదైన మున్నిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోట్యా. కానీ, ఇంట్లోవాళ్ల వల్ల అది సాధ్యం కాదు. తర్వాత గోట్యాకు ఉపనయనం చేస్తారు. ఆ తర్వాత మున్నిని దక్కించుకునేందుకు కొంకణ్ గ్రామంలోని సముద్రం ఒడ్డు పక్కన ఉన్న చెటుక్‌వాడిలోని శాపగ్రస్త చెట్టు వద్ద తన చెల్లిని నరబలి ఇద్దామనుకుంటాడు. కానీ, అది ప్లాప్ అవుతుంది. అక్కడే గోట్యా మరణిస్తాడు.

అయితే, ఉపనయనం చేసి పది రోజులు కాకముందే గోట్యా మరణించడంతో తాను బ్రహ్మ రాక్షసుడిగా మారతాడని చెట్టుకు పూజలు చేస్తారు. కట్ చేస్తే తల్లి పమ్మీ (మోనా సింగ్)తో కలిసి పార్లర్ రన్ చేస్తాడు బిట్టు (అభయ్ వర్మ). తనతోపాటే పెరిగినా బేలా (శార్వరి వాఘ్)‌ను బిట్టు ప్రేమిస్తాడు. కానీ, తను మాత్రం ఇంకొకరిని లవ్ చేస్తుంది. తన కజిన్ సిస్టర్ రుక్కు (భాగ్యశ్రీ లిమాయే) పెళ్లి కోసం అని తల్లి పమ్మీ, నానమ్మ గీత (సుహాస్ జోషి)తో కలిసి కొంకణ్ వెళ్తాడు బిట్టు.

ట్విస్టులు

చెల్లెలి పెళ్లి కోసం వెళ్లిన బిట్టుకు కొంకణ్‌లో ఏం జరిగింది? అక్కడ తన తండ్రి గురించి బిట్టు ఏం తెలుసుకున్నాడు? బిట్టు వెంట ముంజ్యా అనే పిల్ల దెయ్యం ఎందుకు పడింది? ముంజ్యాకు ఏం కావాలి? ముంజ్యా బారి నుంచి తనను బేలాను బిట్టు కాపాడడా? ఈ క్రమంలో ఎల్విస్ కరీమ్ ప్రభాకర్ (సత్యరాజ్) పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ముంజ్యా చూడాల్సిందే.

విశ్లేషణ:

సాధారణంగా హారర్ సినిమాలు అన్ని దాదాపుగా ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంటాయి. కానీ, వాటి ఎగ్జిగ్యూషన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే, ముంజ్యలో అసలు కథ అంతర్లీనంగా పాతదైనట్లు అనిపించినా చూపించిన తీరు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బ్రహ్మణుల్లో కౌమార దశలో ఉన్న అబ్బాయిలకు ఉపనయనం చేస్తారు. కొంకణ్ ప్రాంతంలో మరాఠీలో ఈ కార్యక్రమం జరిగిన పిల్లలను ముంజ్య అని పిలుస్తారు.

ముంజ్యగా మారిన గోట్యా బ్రహ్మ రాక్షసుడిగా మారే కథ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఆ తర్వాత తనకు కావాల్సింది నెరవేర్చుకునేందుకు చేసే పనులు, సీన్స్ మాత్రం రొటీన్‌గా ఉన్నాయి. చాలా వరకు ముందు జరిగే సీన్లను ఊహించవచ్చు. సినిమా మొత్తం ఏం జరుగుతుందనేది ఈజీగా గెస్ చేయొచ్చు. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే, సినిమాకు జస్టిన్ వర్గీస్ ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. బీజీఎమ్‌తోనే రెగ్యులర్ సీన్లపై కూడా ఇంట్రెస్టింగ్ కలిగేలా చేశారు.

ఆకట్టుకునే విజువల్స్- బీజీఎమ్

గ్రాఫిక్స్, విజువల్స్, హారర్ మూడ్ వచ్చేలా బాగానే తీర్చిదిద్దారు. అలాగే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించాయి. పిల్ల దెయ్యం విజువల్‌గా కొత్తగా ఉంది. అటు భయపట్టేలా ఇటు నవ్వు తెప్పించేలా యూనిక్‌గా డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. ఓ పాట బాగానే ఉంది. ఇక అభయ్ వర్మ నటన చాలా బాగుంది. లవ్, భయం, ఎమోషన్ చాలా బాగా చూపించాడు.

శార్వరి వాఘ్ పర్వాలేదనిపించింది. గోట్యాగా చేసిన పిల్లాడి నటన బాగుంటుంది. సత్యరాజ్ పాత్ర పర్వాలేదు. కానీ, పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. మోనా సింగ్, సుహాస్ జోషి నటన ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా చెప్పాంటే టైమ్‌పాస్ కోసం ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు.

ఫైనల్‌గా చెప్పేది..

అయితే, రెండు గంటల నిడివి ఉన్న ముంజ్య డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపుగా అర్థమయ్యే సంభాషణలే ఉన్నాయి. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 2.75/5

Whats_app_banner