తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simhadri - Worlds Largest Screen: రీ రిలీజ్‌లో సింహాద్రి ర‌చ్చ - వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌లో బుకింగ్స్ ఓపెన్‌

Simhadri - Worlds Largest Screen: రీ రిలీజ్‌లో సింహాద్రి ర‌చ్చ - వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌లో బుకింగ్స్ ఓపెన్‌

24 April 2023, 14:13 IST

  • Simhadri - Worlds Largest Screen: ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న సింహాద్రి సినిమా రీ రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌లో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు. ఈ థియేట‌ర్ ఎక్క‌డ ఉందంటే...

ఎన్టీఆర్ సింహాద్రి
ఎన్టీఆర్ సింహాద్రి

ఎన్టీఆర్ సింహాద్రి

Simhadri - Worlds Largest Screen: ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సింహాద్రి రీ రిలీజ్‌లోనూ భారీ హైప్‌తో అద‌ర‌గొడుతోంది. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్న‌ది. 4కే, డాల్బీ ఆట్మాస్ టెక్నాల‌జీలో సింహాద్రిని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప మీద దొంగతనం వేసిన జ్యోత్స్న.. శౌర్య నెక్లెస్ కొట్టేసిందన్న పారిజాతం

Brahmamudi May 8th Episode: అత్త కోసం కావ్య త్యాగం - రాజ్ బ‌దులు ఇంట్లో నుంచి వెళ్లిపోనున్న అప‌ర్ణ - ఇర‌కాటంలో రుద్రాణి

Asuraguru Review: అసుర గురు రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

కాగా ఈ సినిమా వ‌ర‌ల్డ్‌లోని లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్‌లో రిలీజ్ కాబోతున్న‌ది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ సిటీలోని ఐమాక్స్ ... వ‌ర‌ల్డ్ లోనే అతిపెద్ద స్క్రీన్ క‌లిగిన థియేట‌ర్‌గా పేరుతెచ్చుకొంది. ఈ థియేట‌ర్‌లో మే 20న సింహాద్రి రిలీజ్ కానుంది. ఈ థియేట‌ర్ బుకింగ్స్‌ను సోమ‌వారం ఓపెన్ చేశారు.

బుకింగ్స్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే టికెట్స్ అమ్ముడుపోవ‌డం గ‌మ‌నార్హం. ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది నిద‌ర్శ‌నంగా నిలిచింది. త్వ‌ర‌లోనే తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి బుకింగ్స్ ఓపెన్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. 2003లో రిలీజైన సింహాద్రి సినిమాకు ఎస్‌.ఎస్ .రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో సింగ‌మ‌లై, సింహాద్రిగా డ్యూయ‌ల్ షేడ్ రోల్స్‌లో ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్ అభిమానుల‌ను మెప్పించింది. దాదాపు ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అప్ప‌ట్లోనే న‌ల‌భై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాలో భూమిక‌, అంకిత హీరోయిన్లుగా న‌టించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.