తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns June 6th Episode: అమర్ ఇంట్లోకి మళ్లీ మనోహరి.. అమ్ముని చంపేందుకు ప్లాన్.. అరుంధతికి వార్నింగ్​!

NNS June 6th Episode: అమర్ ఇంట్లోకి మళ్లీ మనోహరి.. అమ్ముని చంపేందుకు ప్లాన్.. అరుంధతికి వార్నింగ్​!

Sanjiv Kumar HT Telugu

06 June 2024, 11:51 IST

google News
  • Nindu Noorella Saavasam June 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 6వ తేది ఎపిసోడ్‌‌లో మనోహరి మళ్లీ అమర్ ఇంట్లోకి అడుగుపెడుతుంది. గార్డెన్‌లో ఉన్న అరుంధతితో అమ్మును చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 6వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 6వ తేది ఎపిసోడ్‌‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 6వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 6th June Episode) పౌర్ణమి ఘడియలు ముగుస్తుండటంతో పిల్లలకి అన్నం తినిపిస్తుంది అమ్ము రూపంలో ఉన్న ఆరు. పిల్లలు కూడా అమ్ము అచ్చం అమ్మలానే ప్రవర్తిస్తోంది అంటే తను మనల్ని అమ్మలా చూసుకోవాలనుకుంటుంది అనుకుంటారు.

అలవాటని తీసుకొచ్చాను

అంజుతో అమ్ము మిస్సమ్మ చాలా మంచిది అని మీరు మిస్సమ్మను తిట్టొద్దని.. హ్యాపీగా ఉండమని చెప్తుంది. దీంతో అంజు ఏంటి అమ్ము అమ్మలా మాట్లాడుతున్నావు అనగానే సరేలేండి అంటూ అమ్ము వెళ్లిపోతుంది. తర్వాత అమర్‌ రూంలోకి పెరుగు తీసుకెళ్లిన అమ్ము మీకు రాత్రి పడుకునే ముందు ఇలా తీసుకోవడం అలవాటని తీసుకొచ్చానని చెప్తుంది. అమర్‌ ఆరును గుర్తు చేసుకుని బాధపడతాడు.

తర్వాత పిలల రూంలోకి వెళ్లి పడుకుంటుంది. అమ్ములోంచి బయటకు వచ్చిన అరుంధతి బాధపడుతుంది. ఆ మనోహరి మీ నీడ కూడా తాకకుండా చాలా దూరం పంపించేశాను నాన్న. ఇక మీరంతా హ్యాపీగా ఉండొచ్చు. మీరు పెద్ద వాళ్లయి సంతోషంగా ఉండటం చూడాలనుకున్నాను. కానీ, దేవుడు నాకు అంత అదృష్టం ఇవ్వలేదు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అరుంధతి.

కారు దిగకుండా

మనోహరిని పట్టుకున్న బీహారీ గ్యాంగ్​ తమతో తీసుకెళ్తుంటే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి మనోహరి నానా తిప్పలు పడుతుంది. చల్లని నీళ్లు కావాలని కారు ఆపుతుంది కానీ, వాళ్లు మనోహరి కారు దిగకుండా జాగ్రత్త పడతారు. వీళ్లు తనని వదిలేలా లేరని ముఖం కడుక్కుంటాను చిరాగ్గా ఉందని చెప్పి కారు దిగి చివరకు వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుంది.

ఉదయాన్నే పిల్లలందరూ కలిసి అమ్మును భయపెడతారు. మీకైమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు పొద్దునే అలా భయపెట్టారు..? అంటుంది అమ్ము. ఏంటమ్మా మేము భయపెట్టామా? మరి నిన్న నువ్వు చేసిందేంటి? ప్రేమ చూపించడమా? అంటుంది అంజు. నిన్ననా నేనేం చేశా? అని అడిగిన అమ్ముతో నువ్వు నిజంగానే మమ్మల్ని ఈ క్వశ్చన్‌ అడుగుతున్నావా? అమ్ము. అల్లరి చేశావు. ఆవేశపడ్డావు. అన్నం తినిపించావు. అమ్మలా బిహేవ్‌ చేశావు. ఆంటీ మీద అరిచావు అని పిల్లలు చెబుతారు.

అయోమయంలో అమ్ము

నేను ఇవన్నీ చేశానా? అంటూ అమ్ము ప్రశ్నిస్తుంది. నిన్న డాడీ కాలుకు దెబ్బ తగిలినప్పుడు ఎంత రచ్చ చేశావు. మనోహరి ఆంటీతో గొడవపడితే అప్పట్నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు అంటుంది అంజు.

గార్డెన్‌లో కూర్చున్న అరుంధతికి ఎవరో వచ్చినట్లు అనిపించి చూస్తుంది. గుప్త గారైతే కాదు. అయినా సమయానికి ఎప్పుడొచ్చారని ఇప్పుడు రావడానికి. ఆయనకు టైం సెన్స్‌ లేదు. పని అంటే గౌరవం లేదు. యమలోకంలో లాగానే ఎక్కడో చెకోడీలు తింటున్నారు. ఆయన పక్కన లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటుండగా.. ఆగుము ఇటు తిరుగుము.. ఇటు రమ్ము.. అంటాడు గుప్త.

గుప్త గారు మీరా? మీ గురించే ఆలోచిస్తున్నా.. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారు. ఎంత బోర్‌ కొట్టిందో తెలుసా? నాకు అంటుంది అరుంధతి. నీవు నన్ను తలుచుకుని అన్న మాటలు అన్నీ నేను వింటిని అంటాడు గుప్త. ఊరికే మీరు వినాలని అలా అన్నాను.. ప్రాంకు అంతే అంటున్న అరుంధతితో ఆ.. ప్రాంకూ నీవు పలికిన ప్రతి మాట నీ మనసు నుంచి వచ్చినది అని నాకు తెలుసు. నా తిండి గురించి, నా పని గురించి మా ప్రభువుల వారి జ్ఞానము గురించి నీవు మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తు ఉండును అంటాడు గుప్త.

నీ పెద్ద కూతురుని పైకి పంపిస్తా

ఏంటి గుప్త గారు మీరు అన్నీ అలా గుర్తు పెట్టుకోవద్దు. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోవాలి అంటూ ఆరు తన మాటలతో గుప్తను ఏమార్చాలని చూస్తుంది. కానీ గుప్త వినకుండా అరుంధతిని తిడతాడు. అయినా నిన్న మీరంతా ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఇంతలో మనోహరి కారులో రావడం చూసి ఇదేంటి మళ్లీ వస్తుంది అని గట్టిగా ఓసేయ్‌ మనోహరి అని అరుంధతి అరుస్తుంది.

దాంతో మనోహరి గార్డెన్‌లోకి వచ్చి ఒసేయ్‌ అరుంధతి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉంటే ఇంకొద్ది రోజులు ఉండు నీ పెద్ద కూతురుని పంపిస్తా తీసుకుని వెళ్దువు అంటుంది. మనోహరి మాటలు విని గుప్త, అరుంధతి ఆశ్చర్యపోతారు. మనోహరి ఏం చేయబోతోంది? అమర్​, భాగీ మధ్య ప్రేమ చిగురిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్​ 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం