తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 9th Episode: అమర్​ కుటుంబానికి అవమానం.. భర్తకు మాట రాకుండా చేసిన మంగళ, భాగీకి అనుమానం

NNS February 9th Episode: అమర్​ కుటుంబానికి అవమానం.. భర్తకు మాట రాకుండా చేసిన మంగళ, భాగీకి అనుమానం

Sanjiv Kumar HT Telugu

09 February 2024, 11:15 IST

google News
  • Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 9వ తేది ఎపిసోడ్‌లో మనోహరి తన పెళ్లి చూపులు చెడగొట్టుకుంటుంది. పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మనోహరి, అమర్ గురించి తప్పుగా మాట్లాడుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 9వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 9వ తేది ఎపిసోడ్‌

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 9వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 9th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 9th February Episode) మిస్సమ్మ విషయంలో తొందరపడి తప్పు చేశారేమో అని అమర్​తో తన అభిప్రాయం చెబుతాడు రాథోడ్​. కానీ, మనోహరిని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తారు. ఆ ఏర్పాట్లు చూడు అని రాథోడ్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్. స్పృహలోకి వచ్చిన రామ్మూర్తి కూతురితో మాట్లాడాలని తపన పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్ ఏం కావాలి అంటే నా కూతురుతో మాట్లాడాలి వెంటనే పిలిపించమని చెప్తాడు.

బిల్లు కట్టడానికి

సరే అని నర్సు భాగిని వెతుకుతూ ఉంటే మంగళ వాళ్లు కనిపిస్తారు. పేషెంట్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్లిపోయారు. అయినా పేషెంట్ కూతురు ఏది అని అడుగుతుంది నర్సు. బిల్లు కట్టడానికి వెళ్లింది. అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు కొంపతీసి మా ఆయన పోయాడా అని అడుగుతుంది మంగళ. అలా ఏం కాదు, ఆయనకి మాట వచ్చింది కూతురుతో మాట్లాడాలనుకుంటున్నారు అంటుంది నర్సు. కంగారు పడిపోతూ ఆయన మాట్లాడకూడదు, ఆయనకి మాట పడిపోవాలి ఏం చేస్తావో నాకు తెలియదు నీకు ఒక నెల జీతం ఈరోజు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది మంగళ.

అప్పుడే బిల్ కట్టేసి వచ్చిన భాగీని తండ్రి రూమ్ లోకి వెళ్లకుండా మాటలతో అడ్డుకుంటుంది మంగళ. మంగళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తండ్రి రూమ్ కి వచ్చేసరికి అప్పుడే సిస్టర్ రామ్మూర్తికి ఇంజక్షన్ ఇవ్వటంతో రామ్మూర్తి పెళ్లి అని ఏదో చెప్పబోతు పూర్తిగా చెప్పకుండానే మత్తులోకి వెళ్లిపోతాడు. ఆయన పెళ్లి అంటూ నాతో ఏదో చెప్పబోయారు అని బాధపడుతుంది భాగీ. ఇంకేముంటుంది పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని చెప్తారు అంటుంది.

అనాధాశ్రమంలో పెరిగారు

మనసులో మాత్రం మళ్లీ ఈ ముసలోడు కూతురుతో మాట్లాడే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఇక్కడ నుంచి పంపించేయాలి అనుకొని భాగితో నువ్వు అవార్డు ఫంక్షన్ కి వెళ్లు అని చెప్పే బలవంతంగా అక్కడి నుంచి పంపిస్తుంది మంగళ. మనోహరి ని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తారు. పెళ్లి కూతురు అనాధ అన్నారు కదా మీకు ఎలా పరిచయం అని అడుగుతారు పెళ్లికొడుకు పేరెంట్స్. నా వైఫ్, ఈమె ఇద్దరూ అనాధాశ్రమంలో కలిసి పెరిగారు. ఈమెకి ఒక కుటుంబం కావాలని నా వైఫ్ భావించింది. అందుకే సంబంధాలు చూస్తున్నాం అంటాడు అమర్​.

మీకు ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు. అయినా భార్య పోయిన ఈయనతో కలిసి ఉంటున్నారు కదా అని తప్పుగా మాట్లాడుతాడు పెళ్లికొడుకు. అమర్ కోపంతో వాళ్లని బయటికి వెళ్లగొడతాడు. తర్వాత పంతులతో ఇలాంటి సంబంధం కాకుండా మంచి సంబంధం చూడమని చెప్తాడు. ఎవరు వచ్చినా ఇలాగే మాట్లాడుతారు. నా వల్ల అమర్, వాళ్ల ఫ్యామిలీ బాధపడకూడదు అని ఏడుపు నటిస్తూ తన గదిలోకి వెళ్లిపోతుంది మనోహరి.

హాస్పిటల్‌కు వెళ్తాను

ఏం నటించారమ్మ అంటుంది నీల. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఈ దెబ్బతో అమర్ వాళ్లు భాగి ఫంక్షన్‌కి కూడా వెళ్లరు అని ఆనందంగా చెప్తుంది మనోహరి. కాళీ భాగి ఇద్దరూ అవార్డు ఫంక్షన్‌కి వెళ్తూ ఉంటారు. నాన్న నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు ఆయనతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటుంది భాగీ. ఇంతలో బైక్‌కి ఏదో ప్రాబ్లం వస్తుంది. నాన్న నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు నేను హాస్పిటల్‌కి వెళ్తాను. నువ్వు బైక్ బాగు చేయించుకుని వచ్చేయ్ అంటుంది భాగీ. నిన్ను ఒక్కదాన్నే పంపిస్తే అక్క నన్ను తిడుతుంది. నేను కూడా వస్తాను ఆగు బైక్ బాగు చేయించుకొని వెళ్దాం అంటాడు.

సరే అంటుంది భాగి. ఆమెకి దూరంగా వచ్చిన కాళీ మంగళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. తనని ఇక్కడికి రానివ్వకుండా చూడు అని చెప్పి తమ్ముడికి ఏదో ప్లాన్ చెప్తుంది మంగళ. జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తున్న అమర్‌తో భాగి ఫంక్షన్ విషయం గుర్తు చేస్తాడు రాథోడ్. కష్టపడి ప్లాన్ చేస్తే ఈ రాథోడ్ ప్లాన్ మొత్తం చెడగొడుతున్నాడు అని మనసులో అనుకొని బయటికి మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడాలో అనే సెన్స్ ఉందా అని కోప్పడుతుంది మనోహరి.

దారిలో ఏం జరుగుతుంది

ఇంట్లో అందరూ బాధలో ఉంటే ఫంక్షన్‌కి ఎందుకు పిలుస్తున్నావు అంటూ ఫైర్ అవుతుంది మనోహరి. అమ్మగారి కోసమైనా వెళ్లాలి కదా అంటాడు రాథోడ్​. నిజమే కానీ ఇప్పుడు అమర్ ఉన్న పరిస్థితులలో ఫంక్షన్‌కి వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడగలడా అంటుంది మనోహరి. అమర్​ అవార్డ్​ ఫంక్షన్​కి వెళ్తాడా? భాగీ హాస్పిటల్​కి వెళ్లే దారిలో ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

తదుపరి వ్యాసం