NNS February 6th Episode: కొడుకుని నిలదీసిన శివరామ్​.. శిక్షించుకున్న అమర్​.. మొగుడిని చంపేస్తానన్న మంగళ-nindu noorella saavasam february 6th episode shivaram fire on amar and mangala murder warning to husband rammurthy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 6th Episode: కొడుకుని నిలదీసిన శివరామ్​.. శిక్షించుకున్న అమర్​.. మొగుడిని చంపేస్తానన్న మంగళ

NNS February 6th Episode: కొడుకుని నిలదీసిన శివరామ్​.. శిక్షించుకున్న అమర్​.. మొగుడిని చంపేస్తానన్న మంగళ

Sanjiv Kumar HT Telugu
Feb 06, 2024 08:33 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌లో పిల్లలకు పనిష్‌మెంట్ ఇచ్చిన అమర్‌పై తండ్రి శివరామ్ ఫైర్ అవుతాడు. పిల్లలు పారిపోయేంత ప్రేమ చూపించకూడదని అంటాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 6th February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 6th February Episode)భాగీ ఫ్రెండ్ మళ్లీ తనను కలవటానికి హాస్పిటల్‌కి వస్తుంది. ఇంతలో అమర్ భాగికి కాల్ చేస్తాడు. నేను గుర్తున్నానా అంటూ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. మీరు గుర్తున్నారు అంటూ భాగీ ఇంకా ఏదో మాట్లాడే లోపు ఆమె ఫ్రెండ్ లోపలికి వస్తుంది. అవార్డు తీసుకోవటానికి వెళ్ళను అంటున్నావ్ అంట ఏమైంది, తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అంటుంది తన ఫ్రెండ్.

అమర్‌కు భాగీ సారీ

నువ్వు ఎన్ని చెప్పు నా మనసు ఎందుకో నాన్నను వదిలి వెళ్లటానికి అంగీకరించడం లేదు అంటుంది భాగీ. నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆమె ఫ్రెండ్​. ఈ మాటలు అన్నీ ఫోన్‌లో వింటాడు అమర్. తర్వాత హలో అనటంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న భాగి నా ఫ్రెండ్ వచ్చేసరికి మీరు లైన్‌లో ఉన్నారని కూడా మర్చిపోయాను అని చెప్పి సారీ చెప్తుంది. పర్వాలేదు కానీ నేను మీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే మీరు అవార్డు తీసుకోవడానికి వెళ్లటమే మంచిది అంటాడు అమర్​.

మీ ఫాదర్ ఎలాంటి కండిషన్‌లో ఉన్నారో నాకు తెలియదు. కానీ, అవార్డు తీసుకొని ఆయన ఎదురుగా నిలబడితే ఆయనకి అంతకు మించిన మెడిసిన్ ఉండదు అని మోటివేట్ చేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పటివరకు వెళ్లకూడదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్లడానికి డిసైడ్ అయ్యాను అని తండ్రితో చెప్తుంది మిస్సమ్మ. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. మనం ఆకలికి ఉండగలం. కానీ ఆనంద్ ఉండలేడు. డాడీని కనీసం ఆనంద్ కైనా భోజనం పెట్టమని అడుగుదామా అంటాడు ఆకాష్​.

ఊరుకోలేకపోతున్నాను

వద్దు, ఇప్పటికే డాడీ మన మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్లి అడిగితే మరింత కోప్పడతారు అంటుంది అమ్ము. ఆకలితో బాధపడుతున్న ఆనంద్ ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది అమ్ము. వాళ్లిద్దర్నీ పట్టుకొని ఆకాష్, అంజు కూడా బాగా ఎమోషనల్ అవుతారు. అదే సమయంలో తండ్రి శివరామ్‌కు అమర్ మీద చాలా కోపం వస్తుంది. నేరుగా అమర్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు చేస్తున్నది ఏమీ బాగోలేదు అమర్, ఇంతవరకు నువ్వు పిల్లల మీద పెడుతున్న కండిషన్స్‌కి నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు. కానీ ఈసారి ఊరుకోలేకపోతున్నాను అంటూ పిల్లల్ని గట్టిగా పిలిచి కిందికి రమ్మంటాడు శివరామ్​.

వాడిపోయి ఉన్నా వాళ్ల మొఖాలని చూపించి చూశావా వాళ్ల ముఖాలు ఎలా వాడిపోయాయో, పిల్లలు దగ్గరగా వచ్చే అంత ప్రేమ లేకపోయినా పర్వాలేదు. కానీ దూరంగా పారిపోయేటంత ప్రేమ ఉండకూడదు అంటాడు. అవున్రా చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు. ఈ ఒక్కసారికి క్షమించు ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను అంటుంది నిర్మల. అమర్ ఏమి మాట్లాడకపోవటంతో ఏమీ మాట్లాడవేంటి అని అడుగుతారు. మీ మనవడి ఆకలి బాధ తెలిసిన మీకు మీ కొడుకు ఆకలి బాధ తెలియలేదా అంటాడు రాథోడ్​.

మిస్సమ్మను తిడతారేమో అని

ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యంగా అమర్‌ని చూస్తారు. అవును బాబు పిల్లలు తినేవరకు సార్ కూడా ఏమీ తినలేదు వాళ్లతో పాటు తింటానని పచ్చి మంచినీళ్లు తాగలేదు అని చెప్తాడు రాథోడ్​. పిల్లలు ఎమోషనల్ అవుతూ వెళ్లి తండ్రిని హగ్ చేసుకుంటారు. మళ్లీ ఇలాంటి తప్పు చేయము అని చెప్పి తండ్రికి సారీ చెప్తారు. మేము నిజం చెబుదామనుకున్నాము డాడీ. కానీ, మిస్సమ్మని తిడతారేమో అని నిజం చెప్పలేదు. మేము తాతయ్యని చూడడానికి వెళ్లాం అంటారు.

తాతయ్యకి ఏం జరిగింది, అయినా నేనెందుకు మిస్సమ్మని తిడతాను అంటాడు అమర్. ఎక్కడ మిస్సమ్మ, భాగి ఒక్కరే అని పిల్లలు చెప్పేస్తారో అని భయపడిన మనోహరి కంగారుగా అక్కడికి వెళ్లి ఆ మిస్సమ్మ గురించి ఇంక మాట్లాడకండి, తన వల్లే మీరు ఇలా తయారయ్యారు అని కోప్పడుతుంది. వీళ్లు అబద్ధం చెప్పటానికి మిస్సమ్మకి ఏంటి సంబంధం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ మనోహరిని కోప్పడతాడు అమర్ తండ్రి. ఏది ఏమైనా మిస్సమ్మ టాపిక్ ఇంక వద్దు అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు అమర్.

మొగుడివి అని కూడా చూడను

తండ్రి దగ్గర ఉన్న భాగిని పెళ్లికి నచ్చిన బట్టలు కొనుక్కో అని కాళీతో పంపిస్తుంది మంగళ. ఇష్టం లేకపోయినా కన్నీటితో కాళీ వెనుక వెళుతున్న కూతుర్ని చూసి బాధపడతాడు రామ్మూర్తి. వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఏంటి అలా చూస్తున్నావు. పెళ్లాపేద్దామనే.. కామ్‌గా ఒక మూలన కూర్చుని పెళ్లి చూడు లేదంటే మొగుడివి అని కూడా చూడను నేరుగా పైకి పంపించేస్తాను అంటూ రామ్మూర్తిని హెచ్చరిస్తుంది మంగళ.

కాళీ వెనుక ఏడుస్తూ షాపింగ్ కి వెళుతూ ఉంటుంది భాగి. అమర్​, భాగీ ఎదురుపడతారా? మంగళ వేసిన ప్లాన్​ వర్కౌట్​ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 7న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!