NNS February 1st Episode: పెళ్లి క్యాన్సిల్ చేయించిన మనోహరి.. మిస్సమ్మ తండ్రి దగ్గరికి అమర్ పిల్లలు.. మంగళ కాళీ టెన్షన్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 1వ తేది ఎపిసోడ్‌లో మనోహరి పెళ్లి కోసం పంతులు పిలవమని చెబుతాడు అమర్. దాంతో రాథోడ్ పంతులును తీసుకొస్తాడు. మరోవైపు రామ్మూర్తిని చూసేందుకు పిల్లలు హాస్పిటల్‌కు వెళ్తారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 1st February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 1st February Episode) మనోహరికి పెళ్లి చేయడం తన బాధ్యత అని చెప్పిన అమర్ వెంటనే పంతులుకి కబురు పెట్టమని తండ్రితో చెబుతాడు. అది విని ఆనందపడుతుంది మనోహరి. అయ్యగారు మీకు సంబంధం చూస్తుంటే ఆనందపడతారేంటి అంటుంది నీల. అమర్ ఇలా చేస్తాడని నేను ముందే ఊహించాను. అందుకే నా ప్లాన్‌లో నేను ఉన్నాను పంతులుగారు వచ్చాక ప్లాన్ ఏంటో నీకే తెలుస్తుంది అంటుంది మనోహరి.
పిల్లలను చూసి షాక్
పిల్లలు రామ్మూర్తిని చూడటానికి హాస్పిటల్‌కి వస్తారు. రిసెప్షనిస్ట్ మీరు ఎవరు అని అడిగితే మేము ఆయన మనవలం అని చెప్తుంది అమ్ము. అలా ఎందుకు చెప్పావు అని తర్వాత అడుగుతుంది అంజు. అలా చెప్పకపోతే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు అందుకే చెప్పాను అంటుంది. తర్వాత రామ్మూర్తి రూమ్ దగ్గరికి వస్తున్న పిల్లల్ని చూసి షాక్ అవుతాడు కాళీ. అదే విషయం మంగళ తో చెప్తాడు. వాళ్లు, భాగి కలిస్తే మీ బావ ఉద్యోగం చేశాడని విషయం తెలిసిపోతుంది. అందుకే వాళ్లు కలవకూడదు అని చెప్తుంది మంగళ.
రామ్మూర్తి రూమ్ దగ్గరికి వచ్చిన పిల్లల్ని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్లిపోండి లేదంటే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు కాళీ. మా నాన్నకు ఫోన్ చేయకండి మేము ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాము. మేము తాతయ్యని చూసి వెళ్లిపోతాము అని రిక్వెస్ట్ చేస్తారు. అయినా కాళీ వాళ్లు ఒప్పుకోకపోతే వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు. రామ్మూర్తిని చూడలేనందుకు బాధపడుతుంది అమ్ము. మనం తాతయ్యని చూసే వెళ్దాం ఎప్పుడు వాళ్లు రూమ్ దగ్గరే ఉండరు కదా వాళ్లు. అటు వెళ్లిన తర్వాత మనం చూద్దాం అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు.
నువ్వే నాకు నచ్చావ్
మిస్సమ్మ గురించి బాధపడుతూ ఉంటారు అమర్ తల్లిదండ్రులు. ఇంతలో రాథోడ్ పంతులు గారిని తీసుకొని వస్తాడు. మనోహరిని చూపిస్తూ ఈ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది మంచి సంబంధాలు చూడండి అని చెప్తాడు. పంతులు లాప్టాప్ తీసి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. నీకు నచ్చిన వాళ్లని సెలెక్ట్ చేసుకో అని మనోహరితో చెప్తాడు అమర్. మనసులో నాకు నువ్వే నచ్చావు అమర్ అని అనుకోని బయటికి మాత్రం నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే బాగుంటాను నీకు తెలుసు కదా అమర్ నువ్వే సెలెక్ట్ చెయ్యు అంటుంది మనోహరి.
దాంతో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ అబ్బాయితో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అంటాడు అమర్. తప్పు చేస్తున్నావు అమర్ కష్టంలో ఉన్న మిస్సమ్మని అలా వదిలేయడం భావ్యం కాదు అంటాడు అమర్ తండ్రి. నాన్న ఆ విషయం వదిలేయండి కావాలంటే మీరు వెళ్లి చూసి రండి అంటాడు అమర్. ఆ తర్వాత బయటకు వచ్చిన పంతులుకి డబ్బులు ఇచ్చి పెళ్లి సంబంధం కుదరకుండా చూడమంటుంది. సంబంధం కుర్చచడం అంటే కష్టపడాలి కానీ చెడగొట్టడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు అంటూ ఆనందంగా ఆ డబ్బులు తీసుకొని వెళ్లిపోతాడు పంతులు.
దేవున్ని పార్థిస్తాం
ఇదంతా చూస్తున్న నీల మీ ప్లాన్ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని మనోహరితో చెప్తుంది. దొంగ చాటుగా రామ్మూర్తి రూమ్‌లో దూరతారు పిల్లలు. రామ్మూర్తి ని ఆ పరిస్థితిలో చూసి బాధపడతారు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం తాతయ్య, త్వరగా కోలుకోండి. మా అమ్మలాగే మీరు కూడా మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోకండి. మీకోసం మేము ఆ దేవుని ప్రార్థిస్తాము త్వరగా కోలుకోండి అంటారు పిల్లలు. రామ్మూర్తి పిల్లల అభిమానానికి కళ్లల్లో నీరు పెట్టుకుంటాడు. తన పక్కనే ఉన్న అంజు చెయ్యి మీద తను చెయ్యి వేస్తాడు.
తాతయ్య మన కోసం తిరిగి వస్తానని మాట ఇచ్చారు. తప్పకుండా మన కోసం తిరిగి వస్తారు అంటుంది అంజు. తాతయ్య రెస్ట్ తీసుకుంటారు ఇక మనం వెళ్దాం అంటుంది అమ్ము. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న అరుంధతి బాగా ఎమోషనల్ అవుతుంది. బయటికి వస్తున్న పిల్లల్ని కాళీ చూస్తాడు. అతను పట్టుకునే లోపే పరిగెట్టి పారిపోతారు పిల్లలు. అంతలో వాళ్లకి మిస్సమ్మ ఎదురవుతుంది. మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. పిల్లలు, మిస్సమ్మ ఎదురుపడటాన్ని చూసి కంగారు పడిపోతుంది మంగళ.
తనకోసం వచ్చారని
తాతయ్యని చూసేసాం కదా ఇంక మేము వెళదాం అంటారు పిల్లలు. తనమీద అభిమానంతో పిల్లలు తన తండ్రిని చూడటానికి వచ్చారు అనుకుంటుంది. మిస్సమ్మ పిల్లలు ఇంకా ఏదో మాట్లాడేసుకుంటారని భయపడిన మంగళ పిల్లల్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. తన తండ్రి వాచ్‌మన్‌గా పనిచేశాడని భాగమతికి తెలిసిపోతుందా? అమర్ మిస్సమ్మను క్షమిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 2న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్