NNS January 31st Episode: మిస్సమ్మను నిలదీసిన అమర్​.. మోసం చేశావంటూ ఆగ్రహం.. పెళ్లికి పంతులుతో మనోహరి కొత్త ప్లాన్-nindu noorella saavasam january 31st episode amar angry on bhagamati and prepared to manohari marraige ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 31st Episode: మిస్సమ్మను నిలదీసిన అమర్​.. మోసం చేశావంటూ ఆగ్రహం.. పెళ్లికి పంతులుతో మనోహరి కొత్త ప్లాన్

NNS January 31st Episode: మిస్సమ్మను నిలదీసిన అమర్​.. మోసం చేశావంటూ ఆగ్రహం.. పెళ్లికి పంతులుతో మనోహరి కొత్త ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2024 01:05 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 31వ తేది ఎపిసోడ్‌లో మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుంది. మిస్సమ్మతో కాళీ, మంగళను చూసిన అమర్ ఫైర్ అవుతాడు. మోసం చేశావంటూ కోప్పడతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 31వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 31వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 31st January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 31st January Episode) మిస్సమ్మ తండ్రి హాస్పిటల్‌లో ఉన్నారని తెలుసుకుని చూసేందుకు వెళ్తాడు అమర్. అక్కడ మంగళ, కాళీని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదే సరైన సమయమని మిస్సమ్మపై చాడీలు చెప్పేందుకు పూనుకుంటుంది మనోహరి. మిస్సమ్మ కావాలనే తన కుటుంబ వివరాలు చెప్పలేదని అమర్​కి చెబుతుంది. దాంతో వీళ్లు మీ పిన్ని మావయ్య అని నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు అమర్.

అమర్‌ని మోసం చేస్తున్నారా

నేను నిజం చెప్పాలని మీ దగ్గరికి వచ్చాను. కానీ ఇంతలో ఫోన్ వచ్చింది అంటుంది మిస్సమ్మ. మరో అబద్ధం చెప్తున్నావా అంటాడు అమర్​. లేదండి, నిన్న రాత్రి మిస్సమ్మ మీతో ఈ విషయం మాట్లాడ్డానికే వచ్చింది అంటాడు రాథోడ్​. మరి నిన్న రాత్రి అడిగితే నాకు ఏమీ తెలియదు అని చెప్పావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. మీ అందరూ కలిసి అమర్‌ని మోసం చేస్తున్నారా.. నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పావంటే ఇంకా దేనికైనా తెగిస్తావు. నువ్వు ఇక ఇంటికి రావద్దు. ఇటు నుంచి ఇటే మీ ఇంటికి వెళ్లిపో. నీ సామాన్లు వేరే మనిషితో పంపిస్తాము అంటుంది మనోహరి.

కోపంతో అమర్, మనోహరి అక్కడ నుంచి వెళ్లిపోతారు. రాథోడ్ కూడా మిస్సమ్మకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది. పంతులు గారితో మాట్లాడాను. రెండు రోజుల్లో పెళ్లంట అని చెప్తుంది మంగళ. అన్ని మీరే చూసుకోండి, ఎప్పుడు వచ్చి పీటల మీద కూర్చోమంటే అప్పుడు వచ్చి తాళి కట్టించుకుంటాను అని ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్లిపోతుంది భాగమతి. ఆనందంతో గంతులు వేస్తారు మంగళ, కాళీ.

మిస్సమ్మ జీవితం నాశనం

మరోవైపు ఏడుస్తున్న కూతుర్ని చూసి నిజం చెప్పటానికి ప్రయత్నిస్తూ చేతిని ఆడిస్తాడు రామ్మూర్తి. ఆ భాష అర్థం చేసుకోలేక నువ్వేమీ బాధపడకు నాన్న, నువ్వు చెప్పినట్లే నేను మావయ్యని పెళ్లి చేసుకుంటాను అని ఏడుస్తూ కింద కూలబడిపోతుంది భాగమతి. ఆ పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఈ విషయం నీకు ఎలా చెప్పటం అని కన్నీరు పెట్టుకుంటాడు రామ్మూర్తి. మిస్సమ్మని చూడటానికి అరుంధతి వెళ్తుంది. రామ్మూర్తిని చూసి షాక్ అవుతుంది.

ఈయన మిస్సమ్మ తండ్రా.. మరి ఈయనని చూస్తే నాకెందుకు గుండెల్లో ఏదోలా అనిపిస్తుంది. అసలు వీళ్లకి నాకు సంబంధం ఏమిటి అనుకుంటుంది. ఇంతలో కాళీ వాళ్లు అక్కడికి వస్తారు. ఎంత మంచి పని చేసావ్ అక్క అని సంతోషంగా అంటాడు. అవున్రా ఒక్క దెబ్బతో నీకు భాగి, నాకు మనోహరి ఇచ్చే 50 లక్షలు అంటుంది మంగళ. అసలు భాగిని నేను పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఆవిడకి ఏమిటి లాభం అంటాడు కాళీ.

అలా జరగనివ్వను

మన డబ్బులు మనకు వస్తున్నప్పుడు ఆవిడకి ఏంటి లాభం అనే విషయం మనకి అనవసరం. ఒక్కసారి ఈ పెళ్లి అవ్వని తండ్రి కూతుర్లిద్దరిని మన కాళ్ల దగ్గర ఉంచుకుందాం అంటుంది మంగళ. ఈ మాటలు విన్న అరుంధతి కంగారు పడిపోతుంది. అందరూ కలిసి మిస్సమ్మ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. అలా జరగనివ్వను ఇప్పుడే విషయాన్ని మిస్సమ్మకు చెప్తాను అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లబోతుంది. ఇంతలో చిత్రగుప్తుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. భగవంతుడిని తిట్టుకుంటుంది.

ఈ సమయంలో మిస్సమ్మకి సాయం చేసే వారు ఎవరూ లేరా అని అనుకుంటుంది. ఇంటికి వచ్చిన అమర్ వాళ్లని మిస్సమ్మ తండ్రికి ఎలా ఉంది అని అడుగుతారు అతని తల్లిదండ్రులు. ఆ మిస్సమ్మ మనల్ని అందరినీ మోసం చేసింది అంటూ జరిగిందంతా చెబుతుంది మనోహరి. మోసం అంటున్నావు, ఇందులో మిస్సమ్మ చేసిన మోసం ఏముంది. ఆమె ఎప్పుడూ నిజాయితీగానే ఉంది. పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంది. తనని అపార్థం చేసుకోవద్దు అని కొడుక్కి చెప్తాడు అమర్​ తండ్రి.

మనోహరికి పెళ్లి చేయాలి

నాన్న ఆ విషయం వదిలేయండి, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనోహరికి పెళ్లి చేయడం నా బాధ్యత మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ముందు పంతులు గారిని పిలిపించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్​. అమర్ తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మనోహరి ఎంతో ఆనందపడుతుంది. అమర్ అయ్యగారు వేరే సంబంధం చూస్తాను అంటే అంత ఆనందపడుతున్నారు ఏంటి అంటుంది నీల.

అమర్ అలా అంటాడని నాకు తెలుసు అందుకే నా ప్లాన్‌లో నేను ఉన్నాను అంటుంది మనోహరి. నీల అర్థం కానట్లు మొహం పెడుతుంది. పంతులుగారు వస్తారు కదా అప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది మనోహరి. కాళీతో మిస్సమ్మ పెళ్లి జరగకుండా అరుంధతి ఏం చేస్తుంది? మనోహరి ప్లాన్​ ఎలా బయటపడుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 1న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner