NNS January 25th Episode: కాళీ నుంచి భాగీని కాపాడిన అమర్.. అరుంధతిని సీసాలో బంధించిన ఘోరా
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 25వ తేది ఎపిసోడ్‌లో మిస్సమ్మపై కాళీ బలత్కారం చేస్తుంటాడు. తప్పించుకునేందుకు మిస్సమ్మ ట్రై చేస్తుంది. ఇంతలో అమర్ వచ్చి కాపాడతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 25th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 25th January Episode) మిస్సమ్మని వెయిటర్ వెంబడించడం చూస్తుంది అరుంధతి. ఎందుకు మిస్సమ్మని వెంబడిస్తున్నాడు అనుకుంటూ వాళ్లని ఫాలో అవుతుంది. రూమ్ లోకి వెళ్లిన మిస్సమ్మ డోర్ వేసుకోబోతే కాలు అడ్డుపెట్టి మరీ గదిలోకి వెళ్లిన కాళీ మిస్సమ్మని బలాత్కరించబోతాడు. అంజు వచ్చి తండ్రిని మిస్సమ్మని చూసారా అని అడుగుతుంది.
మీరు ఆడుకోండి
ఇంతలో అంజు అన్న వచ్చి మిస్సమ్మ పై రూమ్‌కి వెళ్ళటం నేను చూశానని చెప్పాను కదా మళ్లీ ఎందుకు డాడీని అడుగుతున్నావు అని అంటాడు. నువ్వు చార్జర్ కోసమే అబద్ధం చెప్తున్నావు కదా నేను నమ్మను అంటుంది అంజు. మిస్సమ్మ గదిలోకి ఎవరో వెళ్లటానికి ప్రయత్నించటం గుర్తుకు వస్తుంది. వెంటనే ఏ గదిలోకి వెళ్లింది అని అంజుని అడుగుతాడు అమర్. అంజు పై గది అని చెప్పడంతో నేను చూస్తాను మీరు వెళ్లి ఆడుకోండి అని చెప్తాడు అమర్.
అప్పటికే కాళీతో పెనుగులాడుతూ ఉంటుంది మిస్సమ్మ. అరుంధతి పైనుంచి కేకలు వేస్తుంది. కానీ ఆమె మాటలు ఎవరూ వినిపించుకోరు. మిస్సమ్మని వెతుకుతూ వచ్చిన అమర్‌కి కేకలు వినిపిస్తాయి. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు. వెంటనే కాళీ అక్కడనుంచి పారిపోతాడు. అమర్ పట్టుకోవాలనుకుంటాడు. కానీ మిస్సమ్మ భయంతో అమర్‌ని హత్తుకుపోతుంది. మిస్సమ్మని సేవ్ చేసినందుకు అరుంధతి కూడా సంతోషిస్తుంది. అరుంధతి వెనక్కి తిరిగేసరికి ఘోర ఉంటాడు. ఆమెపై విభూది జల్లి గాజు సీసాలో బంధించేస్తాడు. ఆ విషయం మనోహరికి చెప్తాడు.
పారిపోయిన అరుంధతి
మనోహరి ఆనంద పడిపోతుంది. నాకు భర్త కావలసిన వాడిని నువ్వు చేసుకొని నా జీవితాన్ని లాక్కున్నావు. ఇప్పుడు అమర్ నా వాడు కాబోతున్నాడు అని అనుకుంటుంది. ఘోర గాజు సీసాలో ఉన్న అరుంధతిని తనతో పాటు తీసుకు వెళ్లిపోతుంటే ఆడుకుంటూ వచ్చిన అంజు ఘోరని గుద్దేస్తుంది. వెంటనే ఘోర చేతిలో ఉన్న గాజు సీసా జారిపోయి అరుంధతి బయటికి వచ్చేసి అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేస్తాడు అమర్.
చూడు అమ్ము ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా పాజిటివ్‌గా తీసుకో. గెలిస్తే ఆనందమే ఓడిపోయినా పర్వాలేదు అనుభవం వస్తుంది. ఆ అనుభవం నెక్ట్స్ టైం ఎలక్షన్స్‌కి పని చేస్తుంది అని చెప్పి కూతురికి ధైర్యం చెప్తాడు అమర్. అలాగే ఎలక్షన్స్‌లో పడి చదువుని నెగ్లెట్ చేయొద్దు అని కూడా చెప్తాడు అమర్. అమ్ము తండ్రి పాదాల దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది. ఎమోషనల్ అవుతాడు అమర్. ఇలాంటి సందర్భాలలో ఎప్పుడూ అరుంధతి నా పక్కన ఉండేది. ఇప్పుడు నేను ఒంటరిగా దీవించవలసి వస్తుంది అని కన్నీరు పెట్టుకుంటాడు.
అమ్మ బ్లెస్సింగ్స్
అది గమనించిన అరుంధతి నేను మీ పక్కనే ఉన్నానండి అని చెప్పి భర్త పక్కన వెళ్లి నిల్చుంటుంది. తండ్రికి నమస్కరించిన తర్వాత పక్కనే ఖాళీ ప్లేస్‌కి కూడా నమస్కరిస్తుంది అమ్ము. అక్కడ ఎందుకు నమస్కరించావు అక్కడ ఎవరూ లేరు కదా అని అడుగుతాడు అమర్. అక్కడ అమ్మ ఉండేది కదా నాన్న ఇప్పుడు కూడా అమ్మ అక్కడ ఉన్నట్లు అనిపించింది అందుకే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటుంది అమ్ము. ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అవుతారు. అరుంధతి కూడా ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకుంటుంది.
తర్వాత పిల్లలు స్కూల్లోకి వెళ్తే అక్కడ రామ్మూర్తి నువ్వు ఎలక్షన్స్‌లో గెలవాలని పూజ చేయించాను అని చెప్పి అమ్ముకి బొట్టు పెడతాడు. అతని అభిమానానికి అరుంధతి ఆనందపడుతుంది. ఇంతలో ఆనంద్, ఆకాష్ పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ మనం అనుకున్నట్లు ఏమీ జరగటం లేదు అందరూ ఆ బంటి గాడికి సపోర్ట్‌గా ఉన్నారు అంటాడు ఆనంద్. స్కూల్ కి ముందుగా వచ్చి అందరిని కలిసి మాట్లాడాడంట అని చెప్తాడు. అందరూ డిప్రెస్ అయిపోతారు. కానీ అంజు ఆలోచనలో పడుతుంది.
ఎలక్షన్స్‌లో గెలుస్తుందా?
అమర్‌ని పెళ్లి చేసుకునేందుకు మనోహరి ఏ ప్లాన్ చేయబోతోంది? అమ్ము ఎలక్షన్స్‌లో గెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!