NNS January 27th Episode: ​​భర్తకు విషం పెట్టిన మంగళ.. చావు బతుకుల్లో రామ్మూర్తి.. ప్రమాదంలో మిస్సమ్మ​!-nindu noorella saavasam january 27th episode mangala gives poison to husband rammurthy and calls bhagamati ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 27th Episode: ​​భర్తకు విషం పెట్టిన మంగళ.. చావు బతుకుల్లో రామ్మూర్తి.. ప్రమాదంలో మిస్సమ్మ​!

NNS January 27th Episode: ​​భర్తకు విషం పెట్టిన మంగళ.. చావు బతుకుల్లో రామ్మూర్తి.. ప్రమాదంలో మిస్సమ్మ​!

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2024 01:24 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌లో కాళీని తెమ్మన్న పసరు మందును రామ్మూర్తి కాఫీలో పెట్టి ఇస్తుంది మంగళ. తర్వాత రామ్మూర్తికి బాగోలేదని మిస్మమ్మకు కాల్ చేసి చెబుతుంది మంగళ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 27th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th January Episode) స్కూల్​ ఎలక్షన్స్​లో అమ్ము గెలవడంతో మిస్సమ్మకి అమర్ థాంక్స్ చెప్తాడు. నువ్వే గనుక అమ్ముని మోటివేట్ చేసి ఉండకపోతే తను గెలిచి ఉండేది కాదు అంటాడు. మీరు మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు సార్. ఏవో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పాను అంటుంది మిస్సమ్మ. లేదు మిస్సమ్మ నువ్వు ఇచ్చిన మోటివేషన్ తోనే నేను అక్కడ అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాను అని థాంక్స్ చెప్తుంది అమ్ము.

నీవల్లేనే గడుగ్గాయి

దీని అంతటికి కారణమైన నన్ను మర్చిపోతున్నారు. అందరూ నాకు థాంక్స్ చెప్పండి అంటుంది అంజు. ఈ ఇంట్లో ఏం జరిగినా అన్ని నీవల్లేనే గడుగ్గాయి. అయినా నువ్వే కదా మమ్మల్ని ఇంత భయపెట్టింది అంటూ అంజుని పట్టుకొని ముద్దులాడుతుంది నిర్మలమ్మ. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన మనోహరితో అమ్ము గెలిచింది అని ఆనందంగా చెప్తుంది నిర్మలమ్మ. కానీ, నా ఫ్రెండ్ ఓడిపోయింది. తనని కొంచెం కొంచెంగా అందరం మర్చిపోతున్నాము అని దొంగ కన్నీరు పెడుతుంది మనోహరి.

ఏమైంది అని అమర్ అడిగితే తన అస్తికలని గంగలో కలపలేదు. కలిపితేనే కదా అరుంధతి ఆత్మకు శాంతి అంటుంది మనోహరి. అవున్రా ఈ హడావిడిలో పడే ఆ పని మర్చిపోయాము అంటుంది నిర్మలమ్మ. మంచి రోజు చూడమ్మా అస్తికలు గంగలో కలిపేద్దాం అని చెప్తాడు అమర్​. ఆ మాటలు వింటున్న అరుంధతి బాధపడుతుంది. నాకు ఇలా ఉండటమే ఇష్టం అంటుంది. మరోవైపు ఇంటికి వచ్చిన భర్తని కాఫీ తాగుతావా అని అడుగుతుంది మంగళ. ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి మంచి మాట వచ్చింది. కాఫీ ఇవ్వు అంటాడు రామ్మూర్తి.

బావ ప్రాణం పోవచ్చు

కాఫీలో పసరు మందు కలిపి ఇస్తుంది మంగళ. అది చూసి బాగా టెన్షన్ పడతాడు కాళీ. రామ్మూర్తి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వటానికి బయటకు వెళ్తాడు. మంగళతో మనం తప్పు చేస్తున్నామేమో, ఆ మనోహరిని నమ్మి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నామేమో అంటాడు కాళీ. తప్పులేదు మనం ఎన్నాళ్లని కష్టపడితే 50 లక్షలు సంపాదించగలం. ఇప్పుడు మీ బావకి కాలు, చెయ్యి పడిపోవచ్చు పోతే ప్రాణం కూడా పోవచ్చు అంటుంది మంగళ.

బాధతో కూర్చున్న అరుంధతి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు చిత్రగుప్తుడు. జరిగిందంతా చెప్తుంది అరుంధతి. అస్తికలు గంగలో కలపడం మంచిదేనా అని అడుగుతుంది. నాకు మంచిది, అస్తికలు గంగలో కలిపిన వెంటనే నీ అస్తిత్వం కోల్పోయి పై లోకానికి వచ్చెదవు అంటాడు చిత్రగుప్తుడు. లేదు నేను రాను నా పిల్లల సుఖసంతోషాలు చూసుకోవాలి అంటుంది అరుంధతి. మనిషికి ఆశ ఎప్పటికీ చావదు. నువ్వు నీ పిల్లలు సుఖ సంతోషాలు చూసుకుంటావు. కానీ వాళ్లకు నీ బాధ ఎప్పటికీ తెలియదు. నువ్వు పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చిత్రగుప్తుడు.

చెప్పడం అవసరమా?

మిస్సమ్మ అమర్ దగ్గరికి వెళుతుంది. దారిలో రాథోడ్ కనపడతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. సార్‌తో మాట్లాడాలి అంటుంది మిస్సమ్మ. మీ నాన్న గురించేనా అంటాడు రాథోడ్​. అవును, దాంతోపాటు ఆరోజు మా ఇంటికి వచ్చింది పిన్ని, మావయ్య అని కూడా సార్ కి చెప్పేస్తాను లేదంటే మోసం చేసిన దాన్ని అవుతాను అంటుంది మిస్సమ్మ. ఇప్పుడు చెప్పడం అవసరమా అంటాడు రాథోడ్. నేను చెప్పేస్తాను లేదంటే మోసం చేసినట్లుగా అనిపిస్తుంది అంటుంది.

నేరుగా అమర్ దగ్గరికి వెళ్లి సార్ మీతో మాట్లాడాలి అంటుంది మిస్సమ్మ. ఎప్పుడూ నాతో ఏదో చెప్పాలనుకుంటావు. కానీ చెప్పడం కుదరదు. అది ఏంటో చెప్పు అంటాడు అమర్​. ఇంతలో ఫోన్ మీద ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి బయటకు వస్తుంది మిస్సమ్మ. మీ నాన్నకి బాగోలేదు నేను హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోతున్నాను. నువ్వు హాస్పిటల్‌కి వచ్చేయ్ అని మంగళ చెబుతుంది. దాంతో హాస్పిటల్‌కు పరిగెడుతుంది మిస్సమ్మ.

ఫోన్ వచ్చిందా?

మరోవైపు భోజనానికి రమ్మని అమర్‌ని పిలుస్తుంది మనోహరి. మిస్సమ్మ ఏది అని అడుగుతాడు అమర్​. మనోహరి తెలియదు అనటంతో అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్​ని అడుగుతాడు. మీ దగ్గరికి వచ్చింది కదా సార్ అని చెప్తాడు రాథోడ్​. నిజమే కానీ ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు అంటాడు. ఫోన్ వచ్చిందా అని ఆనందంగా అడుగుతుంది మనోహరి. అదేంటి అలా అడుగుతున్నావ్. ఆ ఫోన్ వస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు అమర్.

అలా ఏం లేదు క్యాజువల్ గా అడిగాను అంతే అని తమాయించుకుంటుంది మనోహరి. తను ఏం మాట్లాడాలనుకుందో నీకు తెలుసా అని రాథోడ్‌ని అడుగుతాడు అమర్​. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మంగళ ప్లాన్​ వర్కౌట్​ అవుతుందా? అమర్​కి నిజం తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner