NNS January 26th Episode: కాళీతో భాగమతి పెళ్లి.. పసరు తీసుకురమ్మన్న మంగళ.. పిల్లల పనికి అమర్ తండ్రి షాక్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 26వ తేది ఎపిసోడ్‌లో కాళీతో భాగమతి పెళ్లి చేసేందుకు ప్లాన్ చేస్తుంది మనోహరి. అందుకు మంగళకు రూ లక్ష అడ్వాన్స్ ఇచ్చి పని పూర్తయితే 50 లక్షలు ఇస్తానంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 26th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 26th January Episode)స్కూల్ ఎలక్షన్స్‌లో పాల్గొంటున్న అమ్ముకి విషెస్ చెప్పి వెళ్లిపోతాడు అమర్. మనం అనుకున్నది వేరు అక్కడ జరుగుతున్నది వేరు, అందరూ ఆ బంటి గాడికే సపోర్ట్ చేస్తున్నారు. వాడు ఎర్లీగా వచ్చి అందరితో మాట్లాడాడంట, వాడి వెనక ప్రిన్సిపల్ ఉండి ఇదంతా చేయిస్తుందట అంటాడు ఆనంద్. అదేంటి మనం అన్ని సెట్ చేసి పెట్టాం కదా. వెళ్లి బంటి గాడితో పోట్లాడతాను అంటుంది అంజు.
అంజుని మందలించి
వద్దమ్మా వాడితో పోట్లాడకు ఇదే అలుసుగా తీసుకొని ఆ ప్రిన్సిపాల్ నిన్ను స్కూల్ నుంచి బయటికి పంపించేస్తుంది. అసలే నీపై తనకి కోపం ఎక్కువ అంటాడు రామ్మూర్తి. పేరు ఇచ్చేటప్పుడే ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది అమ్ము. చూడు అక్క నీవల్ల ఎంత బాధ పడుతుందో అని అంజుని మందలించి వెళ్లిపోతారు ఆకాష్, ఆనంద్. అంజు కూడా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. బాధపడుతూ ఈ తల్లి లేని పిల్లల్ని మోటివేట్ చేయడానికి ఎవరూ లేరా అని మనసులో అనుకుంటాడు రామ్మూర్తి.
నేనున్నాను నా పిల్లలకి ధైర్యం చెప్తాను ఎలాగైనా నా పిల్లని గెలిపించుకుంటాను అంటుంది అరుంధతి. కానీ, ఎప్పటిలాగే ఆమె మాటలు ఎవరికీ వినిపించవు. మరోవైపు డోర్ కొట్టడంతో తమ్ముడిని వెళ్లి తలుపు తీయమంటుంది మంగళ. తలుపు తీసిన కాళీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంట్రా అలా ఉండి పోయావు ఎవరు వచ్చారు అని మంగళ కూడా డోర్ దగ్గరికి వచ్చిచూసి ఎదురుగా మనోహరి ఉండడం చూసి షాక్ అవుతుంది. గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివ్వరా ఏంటి అని అడుగుతుంది మనోహరి.
పసరు తీసుకురా
ఏం లక్ష్మీదేవి, అనుకోవడమే కానీ ఇప్పటివరకు ఏ లక్ష్మీదేవి చేతి వరకు రాలేదు అంటుంది మంగళ. భాగమతితో నీ తమ్ముడు పెళ్లి చేసి ఆ ఇంటి నుంచి తీసుకువచ్చేస్తే 50 లక్షలు ఇస్తాను అని చెప్పి లక్ష రూపాయలు అడ్వాన్స్ మంగళ చేతిలో పెడుతుంది మనోహరి. ఆనందపడిపోతూ డబ్బుతో కొట్టారు కదా ఇంక మీ పని అయిపోయినట్లే అంటుంది మంగళ. దాంతో మనోహరి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మన ఊరికి వెళ్లి పచ్చి పసరు తీసుకురా అని చెప్పి తమ్ముడికి చెప్తుంది మంగళ.
అది ఎందుకు ఇప్పుడు, అది తింటే చచ్చిపోతారు అంటాడు కాళీ. చెప్పిన పని చేయు అని కసిరి పంపించేస్తుంది మంగళ. 50 లక్షలు చేతికి వస్తాయి అంటే ఏం చేయడానికైనా సిద్ధమే అని మనసులో అనుకుంటుంది. రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది మిస్సమ్మ. అప్పుడే అమర్ ఆర్ జె తో మాట్లాడాలనుకున్నాను మర్చిపోయాను అని చెప్పి ఆమెకి ఫోన్ చేస్తాడు. అయితే ఆర్ జె మిస్సమ్మ అని అమర్ కి తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేసిన మిస్సమ్మకి కూడా ఫోన్ చేసింది అమర్ అని తెలియదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఎదురుపడతారు.
ఏదో ఒక బిజీగా
ఫోన్ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అమర్. స్కూల్ కి వెళ్తున్నాను ఈరోజు ఎలక్షన్స్ కదా అమ్ము వాళ్లు ఎలా ఉన్నారో ఏంటో అందుకే వెళ్తున్నాను అంటుంది మిస్సమ్మ. అయితే పద నేను డ్రాప్ చేస్తాను అంటాడు అమర్. మిస్సమ్మ ఒక నిమిషం ఉండమని చెప్పి పక్కకు వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతూ ఇప్పుడు నేను అర్జెంట్ పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమర్ ఏంటి ఈ పిల్ల ఎప్పుడు మాట్లాడదామన్నా ఏదో ఒక బిజీగా ఉంటుంది అనుకుంటాడు. తర్వాత మిస్సమ్మ, అమర్ ఇద్దరు స్కూల్ కి వెళ్తారు.
మరోవైపు ఇంట్లో అమ్ము గెలిచిందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ తండ్రి. ఇంతలో డల్‌గా ఇంటికి వచ్చిన పిల్లల్ని అమర్ వాళ్లని చూసి ఏం జరిగింది అని అడుగుతారు. ఎవరు ఏమీ మాట్లాడకపోవటంతో పోనీలే అమ్ము ఓడిపోతే వచ్చే నష్టం లేదు అనుభవం వస్తుంది అంటారు. అప్పుడు అక్క గెలిచింది అని చెప్తుంది. అందరూ ఆనందంతో గంతులు వేస్తారు. మీరందరూ కలిసి మమ్మల్ని బురిడీ కొట్టించారన్నమాట అంటాడు అమర్ తండ్రి. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
అరుంధతి ఎమోషనల్
ఇదంతా చూస్తున్న అరుంధతి నా కుటుంబాన్ని ఇలా చూసి ఎంత కాలం అయింది అని ఎమోషనల్ అవుతుంది. భాగీని పెళ్లికి ఒప్పించేందుకు మంగళ ఏం చేయబోతుంది? మనోహరి ప్లాన్ అమర్‌కి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!