NNS February 3rd Episode: పేపర్‌లో ఆర్జే భాగీ ఫొటో చూసిన అమర్! పిల్లలకు తప్పని పనిష్‌మెంట్.. పెళ్లి సంతోషంలో కాళీ
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌లో స్కూల్‌లో అబద్దం చెప్పి ఎక్కడికీ వెళ్లారని పిల్లలను నిలదీస్తాడు అమర్. మోసాలు, అబద్దాలు మిస్సమ్మ నుంచే వచ్చాయని మనోహరి మరింత రెచ్చగొడుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam 3rd February Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 3rd February Episode) భాగీ తన తండ్రి కోరిక తీర్చేందుకు కాళీతో పెళ్లికి ఒప్పుకుందని తెలిసి కోప్పడుతుంది ఆమె స్నేహితురాలు. మీ మావయ్య ఎంత మంచి వాడిగా మారినప్పటికీ అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోను అంటుంది. నేను అవన్నీ ఆలోచించే పరిస్థితులలో లేను. మా నాన్న కోరిక నేను పెళ్లి చేసుకోవడం అయితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఇంకేమీ ఆలోచించను అని ఏడుస్తూ చెప్తుంది భాగీ.
డిస్టర్బ్ చేయొద్దు
అప్పుడే సిస్టర్ వచ్చి పేషెంట్‌ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పటంతో భాగీ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తను చెప్పినా భాగీ ఈ పెళ్లి చేసుకుంటాను అన్నదంటే ఇంక నా పెళ్లిని ఎవరు ఆపలేరు అని అక్కతో చెప్పి ఆనందపడతాడు కాళీ. పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవటంతో అమర్ తల్లిదండ్రులు ఆందోళన పడతారు. గదిలో కూర్చున్న మనోహరితో అయ్యగారు బయటకు వెళ్లారు మళ్లీ వచ్చి ఆయన గదిలోకి వెళ్లిపోయారు ఏం జరిగి ఉంటుంది అని అంటుంది నీల.
వెళ్లి అడుగు ఇప్పుడు ఉన్న కోపంలో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే కంటి చూపుతోనే కాల్చేస్తాడు అంటుంది మనోహరి. అప్పుడే పిల్లలు భయపడుతూనే ఇంట్లో అడుగు పెడతారు. డాడీతో నేను మాట్లాడుతాను మీరు ఎవరు మాట్లాడకండి అని అంజు చెప్పడంతో కామ్‌గా ఇంట్లోకి వస్తారు. వారిని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు అమర్ తల్లిదండ్రులు. ఇంతలో మనోహరి వచ్చి స్కూల్లో అబద్ధం చెప్పి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది, అసలు ఎక్కడికి వెళ్లారు అని నిలదీస్తుంది.
మిస్సమ్మను కూడా తిడతారు
అసలే వాళ్లు భయపడుతున్నారు వాళ్లని అలా భయపెట్టకు మెల్లగా అడుగు అంటుంది అరుంధతి. అయితే యధావిధిగా ఆమె మాటలు ఎవరికీ వినిపించవు. మేము మా డాడీతో మాట్లాడుతాం అంటారు పిల్లలు. అప్పుడే కిందికి వస్తూ ఏం మాట్లాడుతారు. అబద్ధం చెప్పి స్కూల్ నుంచి ఎలా బయటపడ్డారో చెప్తారా అంటూ కోపంగా ప్రశ్నిస్తాడు అమర్. ఇప్పుడున్న కోపంలో తాతయ్యని చూడడానికి వెళ్లామని చెప్తే అక్కడ ఉన్న మిస్సమ్మని కూడా తిడతారు అనుకుంటారు పిల్లలు. అందుకే ఏమి సమాధానం చెప్పకూడదు అనుకుంటారు.
నిజం చెప్పండి ఎక్కడికి వెళ్లారు. అసలు మీకు ఈ అలవాటు ఎలా అయింది అంటాడు అమర్. ఇంకెక్కడ అలవాటవుతుంది. మన ఇంట్లో అబద్దాలు చెప్పేది, మోసాలు చేసేది ఆ మిస్సమ్మ ఒక్కతే ఉంది. తనను చూసే వీళ్లు ఇలా తయారయ్యారు. ఎంత డిసిప్లిన్‌గా ఉండేవారు ఆఖరికి ఇలా తయారయ్యారు అని రెచ్చగొడుతుంది మనోహరి. అమర్ తల్లిదండ్రులు మనోహరిని మందలిస్తూ పిల్లలని, మిస్సమ్మని వెనకేసుకుని వస్తారు. పిల్లల్ని వెనకేసుకొరావద్దని తల్లిదండ్రులని కోప్పడతాడు అమర్.
వినిపించుకోకుండా
అతిగారాభం పిల్లల్ని పాడు చేస్తుందని మరొకసారి రుజువయింది అంటాడు అమర్. పిల్లలు ఎంతకీ నోరు విప్పక పోవటంతో మీరు మాట్లాడటం లేదు కదా అయితే ఇంట్లో వాళ్లు ఎవరూ మీతో మాట్లాడరు. మీకు ఫుడ్ పెట్టరు ఇదే మీకు పనిష్‌మెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ, అమర్ మాట కాదనలేక పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడనుంచి వెళ్లిపోతారు పిల్లలు.
ఇకమీదట మీ కష్టాన్ని వినేది, బాగోగులు చూసేది నేను మాత్రమే. నన్ను దాటి మీ డాడీ దగ్గరికి మీరు వెళ్లలేరు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది మనోహరి. ఆ రాత్రి పిల్లలు ఆకలితోనే ఉంటారు. మరుసటి రోజు పేపర్ చూసిన రాథోడ్ ఆనందంగా ఇంట్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. ఏమైంది ఎందుకలా అరుస్తున్నావ్ అంటుంది మనోహరి. అమర్ తల్లిదండ్రులతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ కూడా ఏమైంది అని అడుగుతాడు. ఈ ఇంటి కోడలికి బెస్ట్ ఆర్జే అవార్డు వచ్చింది అని ఆనందంగా చెప్తాడు రాథోడ్.
ఇద్దరు ఒక్కరే అని
ఈ ఇంటి కోడలు ఏంటి అని చికాగ్గా అడుగుతుంది మనోహరి. అరుంధతి అమ్మగారు భాగమతిని చెల్లి అని పిలిచేవారు అంటే ఈ ఇంటి కోడలనే కదా అర్థం అంటాడు రాథోడ్. నా చెల్లెలికి అవార్డు వచ్చింది అని ఆనందపడుతుంది అరుంధతి. రాథోడ్ చేతిలో పేపర్ చూస్తూ ఇప్పుడు భాగమతి ఫోటో పేపర్‌లో వేశారేమో, అమర్ చూసాడంటే మిస్సమ్మ, భాగమతి ఇద్దరు ఒకరే అని తెలిసిపోతుంది అని కంగారు పడిపోతుంది మనోహరి.
రాథోడ్ దగ్గర పేపర్ తీసుకోవాలనుకుంటుంది. అంతలోనే అమర్ రాథోడ్ దగ్గర పేపర్ తీసుకొని ఓపెన్ చేస్తాడు. మిస్సమ్మనే తన భార్య చెల్లెలు ఆర్జే భాగీ అని అమర్‌కి తెలిసిపోతుందా? మిస్సమ్మను అమర్ క్షమిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఫిబ్రవరి 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!