తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  18 Pages First Single: నిఖిల్ సినిమాలో 'నన్నయ్య రాసిన' సాంగ్.. ఎప్పుడొస్తుందంటే?

18 Pages First Single: నిఖిల్ సినిమాలో 'నన్నయ్య రాసిన' సాంగ్.. ఎప్పుడొస్తుందంటే?

18 November 2022, 16:15 IST

    • 18 Pages First Single: నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 18 పేజీస్. ఈ సినిమా నుంచి నన్నయ్య రాసిన అనే పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సాంగ్‌ను నవంబరు 22న రిలీజ్ చేయాలని ప్లాన్ చేయలేదు.
18 పేజీస్  ఫస్ట్ సింగిల్ ప్రోమో
18 పేజీస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో

18 పేజీస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో

18 Pages First Single: కార్తికేయ-2 సినిమాతో పాన్ఇండియా రేంజ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన తాజా చిత్రం 18 పేజీస్. రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ2 తనకు జోడీగా కనిపించిన అనుపమ పరమేశ్వరనే మరోసారి నిఖిల్ పక్కన నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రాబోతుంది. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెట్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

18 పేజీస్ చిత్రం నుంచి నన్నయ్య రాసిన అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. నవంబరు 22న ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరో హీరోయిన్లు రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన వారుగా తెలుస్తోంది. నిఖిల్ ఫొటో పైన ఉండగా.. అనుపమ ఫొటో తిరిగేసి ఉండటం గమనార్హం.

ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 18 పేజీ చిత్రానికి కథ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ రాయడం గమనార్హం.

నిఖిల్, అనుపమ పరమేశ్వర్ హీరో, హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నివాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపిసుందర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. వసంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.