Pushpa 2-Niharika : పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్
07 May 2023, 13:56 IST
- Niharika In Pushpa 2 : అల్లు అర్జున్ నటించిన పుష్ప-1 ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దీంతో పుష్ప 2 ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
నిహారిక
అల్లు అర్జున్ పుష్ప(Allu Arjun Pushpa) సినిమా భారీ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2(Pushpa 2) షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. పుష్ప 2లో మెగా డాటర్ నిహారిక(Niharika) నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో గిరిజన అమ్మాయిగా ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్ కనిపించనుందట. అయితే ఇప్పటి వరకూ నిహారికను చూసినట్టుగా కాకుండా.. డిఫరెంట్ గా ఉండనుందట. ఈ పాత్రకు మెుదట సాయి పల్లవి(Sai Pallavi)ని సంప్రదించారట.. కానీ ఆమె తిరస్కరించడంతో నిహారికను సెలక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది పుష్ప(Pushpa) చిత్రం. పలు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్(Allu Arjun)కు జోడిగా రష్మిక(Rashmika) నటించింది. మలయాళ స్టార్ ఫాహద్ ఫజిల్ కీలక పాత్రలో నటించాడు. సినిమా నటులు, క్రికెటర్లు.. ప్రముఖులు కూడా ఈ సినిమాలోని డైలాగ్స్ తో రీల్స్ చేశారు. ఇప్పటికీ వాడుతూ ఉంటారు. ఇక పాటలు అయితే.. సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి సినిమా పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో మెగాడాటర్ నిహారిక నటిస్తుందనే వార్తతో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో నిహారిక గిరిజన అమ్మాయిగా కనిపిస్తుందట. పోలీస్ ఇన్ ఫార్మర్ గా నటిస్తుందనే టాక్ నడుస్తోంది. అడవుల్లోకి పుష్ప వెళ్లాక.. గిరిజన యువతిగా పోలీసులకు సమాచారం ఇస్తుందట. పుష్పరాజ్ పక్కనే ఉంటూ.. ఈ పని చేస్తుందట. ఈ వార్తలో ఎంత వరకు నిజముందో చూడాలి.
పుష్ప చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపింది. బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా పాటలు, డైలాగులు ఇప్పటి వాడుతూ ఉంటారు. ఇంతటి సక్సెస్ కావడంతో పార్ట్ 2 మీద హైప్ బాగా క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 16, 2023 దేశ వ్యాప్తంగా విడుదల అవనుంది.