Rashmika Popular Celebrity: రష్మిక అరుదైన ఘనత.. పాపులర్ సెలబ్రెటీగా గుర్తింపు-rashmika mandanna makes it to imdb popular indian celebrities ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Popular Celebrity: రష్మిక అరుదైన ఘనత.. పాపులర్ సెలబ్రెటీగా గుర్తింపు

Rashmika Popular Celebrity: రష్మిక అరుదైన ఘనత.. పాపులర్ సెలబ్రెటీగా గుర్తింపు

Maragani Govardhan HT Telugu
Apr 15, 2023 04:25 PM IST

Rashmika Popular Celebrity: నేషనల్ క్రష్ రష్మిక అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ పోర్టల్ ఐఎండీబీ ప్రకటించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో ఈ ముద్దుగుమ్మ చోటు దక్కించుకుంది.

రష్మిక మందన్నా
రష్మిక మందన్నా

Rashmika Popular Celebrity: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. కన్నడ చిత్రాలతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళంతో పాటు ప్రస్తుతం హిందీలో పాపులర్ హీరోయిన్‍‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. తన అందానికి, అభినయానికి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ(IMDb) ప్రకటించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో చోటు దక్కించుకుంది.

ఐఎండీబీ ప్రకటించిన క్లౌడ్ నైన్ జాబితాలో రష్మిక మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల ప్రారంభంలో తన పుట్టినరోజు రావడం, పుష్ప-2 టీజర్ విడుదల కావడం తదితర కారణాల వల్ల ఇంట్నెట్‌లో ఎక్కువ మంది మాట్లాడుకునే సెలబ్రెటీల్లో ఒకరిగా రష్మిక నిలిచింది. దీంతో మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఐఎండీబీ తన ట్విటర్ వేదికగా పోస్టు ద్వారా తెలియజేశారు.

“గత వారం అభిమానులను రష్మిక బర్త్‌డే జరపడం, పుష్ప2 టీజర్ రావడంతో ఆమె ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ ఫీచర్‌లో మూడో స్థానంలో నిలిచింది” అని ఐఎండీబీ ట్వీట్ చేసింది. నేషనల్ క్రష్ ఈ అరుదైన ఘనత సాధించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక.. పుష్ప-2 చిత్రంతో ఫుల్ బిజీగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదికాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌తో ఓ మూవీకి పచ్చజెండా ఊపింది. దీంతో పాటు తెలుగు, తమిళంలో రెయిన్ బో అనే ఓ ద్విభాషా చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా చేస్తోంది. దీనికి శాంతారుబన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్‌లోనూ నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.

Whats_app_banner