Pushpa Dialogues | ఆన్సర్ షీట్స్ లో 'పుష్ప' సినిమా డైలాగులు.. 'పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే'-allu arjun s pushpa movie dialogues in west bengal 10th class answer sheets ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pushpa Dialogues | ఆన్సర్ షీట్స్ లో 'పుష్ప' సినిమా డైలాగులు.. 'పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే'

Pushpa Dialogues | ఆన్సర్ షీట్స్ లో 'పుష్ప' సినిమా డైలాగులు.. 'పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే'

Anand Sai HT Telugu
Apr 12, 2022 03:32 PM IST

సినిమాల ప్రభావం.. జనాల మీద ఎంతుందో తెలియదు కానీ.. పంచ్ డైలాగులా ప్రభావం బాగా ఉంది అంటాడు ఓ సినిమాలో మహేశ్ బాబు. అయితే ఇప్పుడు డైలాగుల ప్రభావం విద్యార్థుల పరీక్షలపైనా పడుతోంది. ఆన్సర్ షీట్లలో పుష్ప సినిమా డైలాగులతో నింపేస్తున్నారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

సినిమాలు అంటే చాలామంది విద్యార్థులకు క్రైజ్. ఇక డైలాగులంటే పడి చచ్చిపోతారు. అయితే తాజాగా సూపర్‌హిట్ సినిమాల ప్రభావం పశ్చిమ బెంగాల్ పదో తరగతి పరీక్షలపై పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని సెకండరీ స్కూల్ (పశ్చిమ బెంగాల్ మాధ్యమిక) ఓ స్కూల్ విద్యార్థి .. పదో తరగతి ఆన్సర్ షీట్లో.. అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమా 'పుష్ప ది రైజ్‌'లోని డైలాగ్స్ తో నింపేశాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'పుష్ప, పుష్ప రాజ్, అపున్ లిఖేగా నహీ,' అంటూ పేపర్ పై రాశాడు.

అయితే అక్కడ జరిగిన పరీక్షల్లో విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్సర్ షీట్లలో సమాధానాలు రాయడం చూసి టీచర్లు షాక్ అయ్యారు. ఓ విద్యార్థేమో.. 'ప్రియమైన మీకు, శుభాకాంక్షలు, ప్రేమను లేట్ చేయోద్దు. మీరు లాక్‌డౌన్‌ లో ఏం చేశారు? నేను నిన్ను ఆశిస్తున్నాను? మీరు బాగానే ఉన్నారా? నేను మీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను.' అని మరో విద్యార్థి రాశారు.

ఇక కొంతమంది విద్యార్థులైతే.. పరీక్షలో వాట్సాప్ భాషను ఉపయోగించారు. వాట్సాప్ లో ఎలా ఛాటింగ్ చేస్తారో.. అదే లాంగ్వేజ్ ని ఉపయోగించారు. ఇంగ్లీష్ పరీక్ష జవాబు పత్రంలో విద్యార్థులు ఈ భాషను ఎక్కువగా ఉపయోగించారని ఓ ఉపాధ్యాయుడు చెప్పారు. వాట్సాప్‌లో చాలా మంది ఇంగ్లీషు-బంగ్లా మిక్స్‌డ్ లాంగ్వేజ్‌లో రాస్తున్నారని, కొంతమంది ఆ భాషలోనే సమాధానాలు రాశారని తెలిపారు.

జవాబు పత్రంలో 'దయచేసి పాస్ మార్కులు ఇవ్వండి' అని రాసే కళను చూసి ఉంటారు. ఇలా పుష్ప సినిమా డైలాగులు, వాట్సాప్ భాష చూసి.. టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జామినర్లు ఆన్సర్ షీట్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. సమాధాన పత్రాలు చదివి ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో.. లేక సినిమాలు చూస్తూ ఉంటున్నారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

కరోనావైరస్ కారణంగా చాలాంది విద్యార్థులు చదివేందుకు ఆసక్తి చూపించడం లేదు. వచ్చి పరీక్షలు రాసి వెళ్తున్నారు. మరోవైపు విద్యార్థులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ కూడా తగ్గింది. విద్యార్థులు ఎక్కువ కాలం పాఠ్యపుస్తకాలకు దూరమైనందుకే సమాధాన పత్రాలు ఇలా ఉంటున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆన్‌లైన్ లెర్నింగ్ కారణంగా.. విద్యార్థుల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయని.., అందుకే వాట్సాప్‌ భాష ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంటున్నారు. అదే ఆన్సర్ షీట్లలో కనిపిస్తోందని చెబుతున్నారు.

పశ్చిమ మిడ్నాపూర్‌లోని షల్బానీలోని మౌపాల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. చాలా కాలంగా పాఠశాలలు మూసివేశాం. చదువులో పిల్లలు చాలా నష్టపోయారు. పరీక్షల జవాబు పత్రాలు మెసేజ్‌లు పంపడానికి లేదా చాటింగ్ చేయడానికి కాదని గుర్తుంచుకోవాలి. కనీసం ఆన్సర్లు రాయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్