తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే

30 December 2022, 6:28 IST

  • OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో వైవిధ్య‌మైన‌ క‌థాంశాల‌తో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఆ సిరీస్‌లు, సినిమాలు ఇవే...

గోల్డ్ మూవీ
గోల్డ్ మూవీ

గోల్డ్ మూవీ

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ట‌ర్ ఫ్లై - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన బ‌ట‌ర్‌ఫ్లై సినిమా డిసెంబ‌ర్ 29 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఘంటా స‌తీష్‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కిడ్నాప్‌కు గురైన అక్క పిల్ల‌ల‌ను కాపాడుకోవ‌డానికి పోరాటం చేసే ఓ యువ‌తి క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. డైరెక్ట్‌గా ఓటీటీ ఈ సినిమా రిలీజైంది.

గోల్డ్ - అమెజాన్ ప్రైమ్‌

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించినమ‌ల‌యాళ సినిమా గోల్డ్ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబ‌ర్ 29న రిలీజైంది. ప్రేమ‌మ్ ఫేమ్ ఆల్పోన్స్ పుత్రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోట్లాది రూపాయ‌ల విలువైన బంగారాన్ని దొంగిలించిన ఓ వ్య‌క్తికి ఎదురైన ప‌రిణామాల‌తో ఈ సినిమా రూపొందింది.

మ‌ట్టి కుస్తి - నెట్‌ఫ్లిక్స్‌

టాలీవుడ్ అగ్ర హీరో ర‌వితేజ నిర్మించిన మ‌ట్టికుస్తీ సినిమా జ‌న‌వ‌రి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విష్ణువిశాల్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హిళ‌ల్ని చిన్న‌చూపు చూడ‌కూడ‌ద‌నే సందేశాత్మ‌క క‌థాంశంతో తెలుగుతో పాటు త‌మిళంలో ఈ సినిమా రూపొందింది.

విజ‌య్ సేతుప‌తి డీఎస్‌పీ - స‌న్ నెక్స్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌

విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన డీఎస్‌పీ సినిమా శుక్ర‌వారం నుంచి (నేడు) నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. పోన్‌రామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకోంది.

రాకెట్ గ్యాంగ్ - జీ5

ఆర్ యా పార్ (వెబ్ సిరీస్‌) -డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

ప‌ట్టాత్తు అస‌ర‌న్ (త‌మిళ్‌) - నెట్‌ఫ్లిక్స్‌

డ‌బుల్ ఎక్స్ఎల్ (హిందీ) - నెట్‌ఫ్లిక్స్‌

ఉడాన్‌ప‌ల్ (త‌మిళం) - ఆహా త‌మిళ్‌

వైట్ నాయిస్ (ఇంగ్లీష్‌) - నెట్‌ఫ్లిక్స్‌

ఛోటా భీమ్ (వెబ్ సిరీస్‌) (హిందీ) - నెట్‌ఫ్లిక్స్‌

చికాగో పార్టీ ఆంటీ (వెబ్‌సిరీస్‌) - నెట్‌ఫ్లిక్స్‌

సీక్రెట్స్ ఆఫ్ స‌మ్మ‌ర్ (సిరీస్‌) - నెట్‌ఫ్లిక్స్‌

ఆల్ఫా మేల్స్ (వెబ్‌సిరీస్‌) - నెట్‌ఫ్లిక్స్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.