తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naresh Pavithra: నరేష్, పవిత్ర మరో పబ్లిక్ రొమాన్స్.. సిక్త్స్ సెన్స్ ప్రోమో అదుర్స్

Naresh Pavithra: నరేష్, పవిత్ర మరో పబ్లిక్ రొమాన్స్.. సిక్త్స్ సెన్స్ ప్రోమో అదుర్స్

Hari Prasad S HT Telugu

16 May 2023, 21:30 IST

google News
    • Naresh Pavithra: నరేష్, పవిత్ర మరోసారి పబ్లిక్ రొమాన్స్ లో మునిగి తేలారు. మాటీవీలో వచ్చే సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ ప్రోమో అదుర్స్ అనిపించేలా ఉంది. ఇందులో ఈ ఇద్దరితోపాటు సేవ్ ది టైగర్స్, డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి.
నరేష్ కు ముద్దు పెడుతున్న పవిత్ర
నరేష్ కు ముద్దు పెడుతున్న పవిత్ర

నరేష్ కు ముద్దు పెడుతున్న పవిత్ర

Naresh Pavithra: లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న నరేష్, పవిత్ర మరోసారి పబ్లిక్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మాటీవీలో వస్తున్న సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ కు స్పెషల్ గెస్టులుగా ఈ ఇద్దరూ వచ్చారు. తమ మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్న వీళ్లు.. ముద్దులు పెట్టుకుంటూ, ముద్దుపేర్లు చెప్పుకుంటూ ఆకర్షించారు.

ఓంకార్ హోస్ట్ గా ఉండే ఈ సిక్త్స్ సెన్స్ షో ఐదో సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రతి వారం సెలబ్రిటీలను గెస్టులుగా పిలుస్తూ.. వాళ్లతో ఆటలు ఆడిస్తూ సరదాగా సాగిపోతోంది. అయితే వచ్చే వారం షోలో నరేష్, పవిత్రతోపాటు హాట్‌స్టార్ వెబ్ సిరీస్ లు సేవ్ ది టైగర్స్, డెడ్ పిక్సెల్స్ లలో నటించిన వాళ్లు కూడా గెస్టులుగా ఈ షోకు వచ్చారు.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా మా టీవీ రిలీజ్ చేసింది. ఇందులో మొదట నరేష్, పవిత్ర ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవిత్రను మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు అని ఓంకార్ అడుగుతాడు. దానికి నరేష్ స్పందిస్తూ.. ముద్దొస్తే అమ్ములు అని, మరీ ముద్దుస్తే అమ్ము అని, ఇంకా ముద్దుస్తే ఇక వద్దులే అంటూ చెప్పకుండా ఆపేశాడు.

ఇక ఇదే ప్రోమోలో పవిత్ర నుదిటిపై నరేష్ ముద్దు పెడతాడు. అటు పవిత్ర కూడా నరేష్ బుగ్గలపై ముద్దిస్తూ సిగ్గుపడుతుంది. జీవితాంతం ఆమె చేతిని వీడేది లేదని నరేష్ చెప్పడం విశేషం. ఈ ఇద్దరికీ ఇది మూడో పెళ్లి. అయితే తమ పెళ్లినే రీల్ స్టోరీగా మళ్లీ పెళ్లి అనే మూవీ తీస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారం విడుదల కాబోతోంది.

ఇక ఈ సిక్త్స్ సెన్స్ షోలో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ నటీనటులు పాల్గొన్నారు. ఇందులో నిహారిక కొణిదెల లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అటు ఇప్పటికే స్ట్రీమ్ అవుతూ మంచి టాక్ కొట్టేసిన సేవ్ ది టైగర్స్ సిరీస్.. నటీనటులు కూడా ఓంకార్ తో కలిసి గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ కొత్త ఎపిసోడ్లు వచ్చే శని, ఆదివారాల్లో టెలికాస్ట్ కానుంది.

తదుపరి వ్యాసం