Malli Pelli Trailer: మళ్లీ పెళ్లి ట్రైలర్ విడుదల.. ఏంటి భయ్యా..! నరేష్-పవిత్ర తమ బయోపిక్ చేశారా?-naresh and pavitra starred malli pelli trailer out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malli Pelli Trailer: మళ్లీ పెళ్లి ట్రైలర్ విడుదల.. ఏంటి భయ్యా..! నరేష్-పవిత్ర తమ బయోపిక్ చేశారా?

Malli Pelli Trailer: మళ్లీ పెళ్లి ట్రైలర్ విడుదల.. ఏంటి భయ్యా..! నరేష్-పవిత్ర తమ బయోపిక్ చేశారా?

Maragani Govardhan HT Telugu
May 11, 2023 11:52 AM IST

Malli Pelli Trailer: టాలీవుడ్ సీనియర్ నటీనటులు నరేష్-పవిత్ర కలిసి నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. నరేష్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మళ్లీ పెళ్లి ట్రైలర్ విడుదల
మళ్లీ పెళ్లి ట్రైలర్ విడుదల

Malli Pelli Trailer: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ నటించిన సరికొత్త చిత్రం మళ్లీ పెళ్లి. ఆయన నిజ జీవిత భాగస్వామి పవిత్రా లోకేష్‌తో కలిసి చేసిన ఈ సినిమా చేశారు. ఎంఎంస్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మళ్లీ పెళ్లి మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా నరేష్-పవిత్రల జీవితంలో జరిగిన కొన్ని వాస్తవికం సంఘటనలను ఇందులో పెట్టినట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్‌లో నరేష్ మూడో భార్య రమ్య.. బెంగళూరులో పవిత్రతో అతడిని పట్టుకోవడం, మీడియా ముందు వారి వ్యవహారం కాంట్రవర్సీగా మారడం లాంటి ఘటనలను ఈ సినిమాలో పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నరేష్-పవిత్ర ప్రేమాయణం ఎలా మొదలైందో కూడా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నరేష్ మాజీ భార్యగా వనితా విజయ్ కుమార్ నటించారు. నరేష్-పవిత్ర ప్రేమను తట్టుకోలేని ఆమె మీడియా ముందుకొచ్చి న్యాయం కోసం పోరాడటం ఇందులో గమనించవచ్చు. బోల్డ్ లవ్ స్టోరీ, ఆసక్తికరమైన పాత్రలతో సినిమాపై బజ్ విపరీతంగా ఏర్పడింది. ఇదే సమయంలో ఎమోషనల్‌గానూ ఉంది.

స్టోరీకి తగినట్లుగానే నరేష్-పవిత్ర తమ పాత్రల్లో జీవించినట్లు తెలుస్తోంది. ఎంఎస్ రాజు టిపికల్ సబ్జెక్టును ఎంతో తెలివిగా డీల్ చేసినట్లు తెలుస్తోంది. అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉండేలా చేసింది. మొత్తానికి సినిమాలో బోల్డ్ కంటెంట్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా సమపాళ్లలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సురేష్ బొబ్బిలితో పాటు అరుల్ దేవ్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నారు. మళ్లీ పెళ్లి చిత్రాన్ని ఈ వేసవి కానుకగా మే 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Whats_app_banner