Malli Pelli Teaser: నరేష్‌కి కన్ను కొట్టి లోపలికి పిలుస్తున్న పవిత్ర.. మళ్లీ పెళ్లి టీజర్ వచ్చేసింది-malli pelli teaser released today april 21st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malli Pelli Teaser: నరేష్‌కి కన్ను కొట్టి లోపలికి పిలుస్తున్న పవిత్ర.. మళ్లీ పెళ్లి టీజర్ వచ్చేసింది

Malli Pelli Teaser: నరేష్‌కి కన్ను కొట్టి లోపలికి పిలుస్తున్న పవిత్ర.. మళ్లీ పెళ్లి టీజర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Jan 08, 2024 06:54 PM IST

Malli Pelli Teaser: నరేష్‌కి కన్ను కొట్టి లోపలికి పిలుస్తోంది పవిత్ర. ఈ ఇద్దరూ నటిస్తున్న మళ్లీ పెళ్లి టీజర్ వచ్చేసింది. నరేష్ మూడో పెళ్లి చుట్టూ తిరిగే ఈ సినిమాను ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నాడు.

పవిత్రా లోకేష్
పవిత్రా లోకేష్

Malli Pelli Teaser: తమ పెళ్లినే క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు నరేష్, పవిత్ర. మళ్లీ పెళ్లి పేరుతో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా టీజర్ శుక్రవారం (ఏప్రిల్ 21) రిలీజైంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. డాక్టర్ నరేష్ వీకే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని మూడో పెళ్లి కథనే నేపథ్యంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

టీజర్ మొదట్లోనే డాక్టర్ నరేష్ వీకే 50 గోల్డెన్ ఇయర్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. ఇటు నరేష్, అటు పవిత్రా లోకేష్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల పెళ్లికి ముందు నరేష్ రెండో భార్య చేసిన గొడవ, ట్విస్టులు, హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర పట్టుబడిన సీన్స్ ను అలాగే చూపెడుతూ ఈ మళ్లీ పెళ్లి టీజర్ రిలీజ్ చేశారు.

విజయ కృష్ణ బ్యానర్ కింద నరేషే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీకి కథతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు ఎమ్మెస్ రాజు. ఇప్పటికే ఈ మళ్లీ పెళ్లి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రాగా.. తాజాగా టీజర్ తో మరోసారి మేకర్స్ ఆసక్తి పెంచారు. ఈ టీజర్ వనితా విజయ్‌కుమార్ మీడియా సమావేశంతో మొదలవుతుంది. తన భర్త తనను మోసం చేశాడని, అతడో మృగం అని అంటుంది.

మరోవైపు నరేష్ అదే సమయంలో పవిత్రా లోకేష్ తో రొమాన్స్ లో మునిగి తేలుతుంటాడు. ఇక ఈ టీజర్ ను కూడా చాలా ఆసక్తిగా ముగించారు. నరేష్, పవిత్ర ఒకరికొకరు కన్ను కొట్టుకుంటూ లోపలికి వెళ్దామా అన్నట్లుగా ముగించారు. ఇప్పటికే భిన్నమైన స్టోరీ లైన్లతో వస్తున్న ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు కూడా అలాంటి స్టోరీలైన్ తో వచ్చాడు.

ఈ మళ్లీ పెళ్లి మూవీకి అరుల్‌దేవ్, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే మళ్లీ పెళ్లి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం