Naresh Pavitra Lokesh Malli Pelli: నరేష్, పవిత్రా లోకేష్ మళ్ళీ పెళ్లి సీక్రెట్ రివీల్
Naresh Pavitra Lokesh Malli Pelli: నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో మళ్ళీ పెళ్లి పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
Naresh Pavitra Lokesh Malli Pelli: పవిత్రా లోకేష్ మెడలో సంప్రదాయబద్దంగా మూడుముళ్లు వేసిన ఓ వీడియోను ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సీనియర్ నటుడు నరేష్. చాలా రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ఉన్న అనుబంధం దృష్ట్యా వారిద్దరు పెళ్లి చేసుకున్నది నిజమేనని అందరూ అనుకున్నారు.
కానీ ఈ పెళ్లి వీడియో వెనకున్న సీక్రెట్‌ను శుక్రవారం నరేష్ రివీల్ చేశాడు. ఇది రీల్ లైఫ్ వెడ్డింగ్ అని, రియల్‌లైఫ్ పెళ్లి కాదని తేల్చిచెప్పాడు. మళ్ళీ పెళ్లి పేరుతో నరేష్, పవిత్రా లోకేష్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తోన్నారు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పవిత్రా లోకేష్ ముగ్గు వేస్తోండగా ఆమెను మురిపెంగా చూస్తూ నరేష్ కనిపిస్తోన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు నరేష్ ప్రకటించారు. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. మళ్ళీపెళ్లి సినిమాలో జయసుధ, శరత్‌బాబు, అనన్య నాగళ్ల, వనితా విజయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
టాపిక్