Malli Pelli Release Date: నరేష్-పవిత్ర రొమాంటిక్ మూవీ రాబోతుంది.. ఈ నెలలోనే విడుదల-naresh and pavitra lokesh satrred malli pelli movie release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malli Pelli Release Date: నరేష్-పవిత్ర రొమాంటిక్ మూవీ రాబోతుంది.. ఈ నెలలోనే విడుదల

Malli Pelli Release Date: నరేష్-పవిత్ర రొమాంటిక్ మూవీ రాబోతుంది.. ఈ నెలలోనే విడుదల

Maragani Govardhan HT Telugu
May 03, 2023 12:19 PM IST

Malli Pelli Release Date: టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్-పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి మూవీ విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.

మళ్లీ పెళ్లి రిలీజ్ డేట్ ఫిక్స్
మళ్లీ పెళ్లి రిలీజ్ డేట్ ఫిక్స్

Malli Pelli Release Date: టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్(Naresh-Pavitra Lokesh) జంటగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి. ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతేకాకుండా నరేష్-పవిత్ర రియల్ లైఫ్‌లో డేటింగ్‌లో ఉంటూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న తరుణంలో.. వారిపై ఈ సినిమా తీయడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్‌ను పంచుకున్న మేకర్స్. మళ్లీ పెళ్లి చిత్రం విడుదల తేదీని(Malli Pelli Release Date) ప్రకటించారు.

నరేష్-పవిత్రా లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి(Malli Pelli) సినిమాను మే 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో నరేష్-పవిత్ర ఒకరినొకరు హగ్ చేసుకుని రొమాంటిక్‌గా కనిపించారు.

ఇటీవలే ఈ సినిమా నుంచి ఉరిమే కాలమా అనే రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు. ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్‌తో ఫీల్ గుడ్ ఎమోషన్‌ను తీసుకొచ్చారు. శ్రీరామ్ సాహిత్యంతో సాంగ్ మరో స్థాయిలో ఉంది. నరేష్-పవిత్ర కెమిస్ట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్క్రీన్‌పై వీరిద్దరి జోడీ బాగుంది.

విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సురేష్ బొబ్బిలితో పాటు అరుల్ దేవ్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వేసవిలో మళ్లీ పెళ్లి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Whats_app_banner