Pavitra-Naresh Romantic Song: ముదురు జంటకు.. ముచ్చటైన పాట.. నరేష్-పవిత్ర రొమాంటిక్ సాంగ్
Pavitra-Naresh Romantic Song: నరేష్-పవిత్ర జంటగా నటించిన సరికొత్త చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ఉరిమే కాలమా అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Pavitra-Naresh Romantic Song: సీనియర్ నటీ నటులు పవిత్రా లోకేష్-నరేష్ ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇదిలా ఉంటే నరేష్-పవిత్ర ప్రధాన పాత్రల్లో మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉండటం, సినిమా కూడా మళ్లీ పెళ్లి చేసుకునే కాన్సెప్టు రావడంతో యువతలో బాగా బజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
నరేష్-పవిత్ర ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఉరిమే కాలమా అంటూ ఈ మిడిల్ ఏజ్డ్ జంటకు యూత్ ఫీల్ ఇచ్చేలా ఈ పాట వారి వయస్సును తగ్గించిందని చెప్పవచ్చు. వీరిద్దరికి ఇంత మంచి ట్రెండింగ్ సాంగ్ ఏంటి? అని ఆశ్చర్యపడక మానరు. సాంగ్ మాత్రం వినేందుకు బాగుంది. మంచి ఎమోషనల్ ఫీల్‌ను ఇస్తుంది.
అనురాగ్ కులకర్ణి ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు. ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్‌తో ఫీల్ గుడ్ ఎమోషన్‌ను తీసుకొచ్చారు. శ్రీరామ్ సాహిత్యంతో సాంగ్ మరో స్థాయిలో ఉంది. నరేష్-పవిత్ర కెమిస్ట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్క్రీన్‌పై వీరిద్దరి జోడీ బాగుంది. యువకుడి మాదిరిగా ట్రెండీ ఔట్‌ఫిట్ ధరిస్తూ నరేష్ అదరగొట్టాడు. వర్కౌట్లు, స్టైలిష్ లుక్‌తో మిడిల్ ఏజ్‌లో ఉన్న కుర్రాడిలా కనిపించారు.
విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సురేష్ బొబ్బిలితో పాటు అరుల్ దేవ్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వేసవిలో మళ్లీ పెళ్లి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.