Dead Pixels Web Series : డెడ్ పిక్సెల్స్ సిరీస్‌తో న‌టిగా రీఎంట్రీ ఇస్తోన్న నిహారిక కొణిదెల - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌-niharika konidela dead pixels web series streaming date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dead Pixels Web Series : డెడ్ పిక్సెల్స్ సిరీస్‌తో న‌టిగా రీఎంట్రీ ఇస్తోన్న నిహారిక కొణిదెల - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Dead Pixels Web Series : డెడ్ పిక్సెల్స్ సిరీస్‌తో న‌టిగా రీఎంట్రీ ఇస్తోన్న నిహారిక కొణిదెల - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2023 02:16 PM IST

Dead Pixels Web Series: డెడ్‌పిక్సెల్స్ వెబ్ సిరీస్‌తో న‌టిగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఏ రోజు రిలీజ్ కానుందంటే....

డెడ్‌పిక్సెల్స్ వెబ్ సిరీస్‌
డెడ్‌పిక్సెల్స్ వెబ్ సిరీస్‌

Dead Pixels Web Series: సుదీర్ఘ విరామం త‌ర్వాత మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల తిరిగి న‌టిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అయితే సినిమాతో కాదు. సిరీస్ ద్వారా ఈనెల‌లోనే తెలుగులో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతున్న‌ది.

నిహారిక కొణిదెల, సాయిరోన‌క్‌, హ‌ర్ష‌చెముడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో డెడ్ పిక్సెల్స్ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సిరీస్ మే 19 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ చూస్తుంటే ఓ వీడియో గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సీరిస్ సాగుతోన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోయి త‌మ ప‌నుల‌ను మానుకొని వీడియో గేమ్ ఆడ‌టంలో మునిగిపోయిన కొంద‌రు యువ‌తీయువ‌కుల‌కు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌నే అంశాల‌తో ఫ‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సిరీస్ రూపొందుతోంది.

బ్రిట‌న్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ఆధారంగా ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా డెడ్ పిక్సెల్స్‌ సిరీస్ రూపొందుతోన్న‌ట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో గాయ‌త్రి అనే నేటిత‌రం యువ‌తిగా నిహారిక కొణిదెల న‌టిస్తోంది.

రాజీవ్ క‌న‌కాల‌, అక్ష‌య్‌, భావ‌న కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక‌. ఆ త‌ర్వాత హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం సినిమాలు చేసింది. పెళ్లి కార‌ణంగా చాలా కాలం పాటు న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఆమె డెడ్ పిక్సెల్స్‌తో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

IPL_Entry_Point