తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pavithra Lokesh: డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది.. అందుకే నరేష్‌తో ముద్దు ముచ్చట్లు: పవిత్ర లోకేష్ మొదటి భర్త

Pavithra Lokesh: డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది.. అందుకే నరేష్‌తో ముద్దు ముచ్చట్లు: పవిత్ర లోకేష్ మొదటి భర్త

Hari Prasad S HT Telugu

16 March 2023, 17:15 IST

google News
    • Pavithra Lokesh: డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది.. అందుకే నరేష్‌తో ముద్దు ముచ్చట్లు అంటూ పవిత్ర లోకేష్ మొదటి భర్త సంచలన కామెంట్స్ చేశాడు. నరేష్ ను పవిత్ర ఈ మధ్యే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
నరేష్, పవిత్ర పెళ్లి ఫొటో
నరేష్, పవిత్ర పెళ్లి ఫొటో

నరేష్, పవిత్ర పెళ్లి ఫొటో

Pavithra Lokesh: లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు నరేష్, పవిత్రా లోకేష్. వయసు ముదిరినా ఈ కన్నడ బ్యూటీ అందానికి ఫిదా అయిపోయిన నరేష్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లో కొంతకాలంగా వీళ్ల పెళ్లే హాట్ టాపిక్. తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని కూడా ఈ జంట వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ లిప్ కిస్ తో చెప్పడం విశేషం.

ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన ఈ జంట గురించి ఇప్పుడు పవిత్రా లోకేష్ మొదటి భర్త సంచలన కామెంట్స్ చేశాడు. ఆమె మొదటి భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. అతడు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డబ్బు, లగ్జరీ లైఫ్ కోసం పవిత్ర ఏమైనా చేస్తుందని అనడం విశేషం. అందుకే 60 ఏళ్లు దాటిన నరేష్ ను పెళ్లి చేసుకుందని సుచేంద్ర చెప్పాడు.

పవిత్ర ఓ అవకాశవాది అని కూడా అన్నాడు. నరేష్ విషయంలోనూ ఆమె ప్లాన్స్ వేరే ఉన్నాయని కూడా వెల్లడించాడు. ఏదో ఒక రోజు పవిత్ర అసలు ఉద్దేశమేంటో నరేష్ కూడా తెలుసుకుంటాడని సుచేంద్ర అనడం విశేషం. గతంలోనూ పవిత్రపై సుచేంద్ర ఇలాంటి కామెంట్సే చేశాడు. ఆమె అసలు మంచి వ్యక్తి కాదని అన్నాడు.

వయసు మీద పడినా.. పవిత్ర ఇప్పటికీ చాలా అందంగానే ఉంటుంది. ఆ అందానికి ఫిదా అయిన నరేష్ రెండో భార్యకు గుడ్ బై చెప్పి పవిత్రను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల ప్రేమాయణం నడిచే సమయంలోనూ నరేష్ రెండో భార్య రచ్చ రచ్చ చేసింది. హోటల్ రూమ్ లో వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించింది. అయితే ఆమె వ్యవహారాన్ని అంత సీరియస్ గా తీసుకోని నరేష్.. పవిత్రను పెళ్లి చేసేసుకున్నాడు.

వీళ్ల పెళ్లి వీడియో కూడా వైరల్ అయింది. గత శుక్రవారమే వీళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. సమ్మోహనం మూవీ షూటింగ్ సమయంలో నరేష్, పవిత్ర మధ్య పరిచయం ఏర్పడింది. అదే ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది.

తదుపరి వ్యాసం