తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Web Series: ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?

Malayalam Web Series: ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?

Hari Prasad S HT Telugu

23 August 2024, 10:28 IST

google News
    • Malayalam Web Series: మొత్తం ప్రపంచమే మెచ్చిన ఓ వెబ్ సిరీస్ ను మన నేచురల్ స్టార్ నాని.. మలయాళంలో తీయాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని అతడు సరిపోదా శనివారం మూవీ కేరళ ప్రమోషన్ల సందర్భంగా చెప్పడం విశేషం. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా?
ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?
ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?

ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?

Malayalam Web Series: మలయాళం సినిమాలకు కొన్నేళ్లుగా సాధారణ తెలుగు ప్రేక్షకులే కాదు ఇక్కడి సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ చూస్తే అదే అనిపిస్తోంది. తన నెక్ట్స్ మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ మలయాళంలో..

మొత్తం ప్రపంచమే మెచ్చిన వెబ్ సిరీస్ లలో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. హెచ్‌బీఓ నిర్మించిన ఈ సిరీస్ ను మలయాళంలో తీయాలని అనుకుంటున్నట్లు నాని చెప్పడం విశేషం. ఈ భాషలో తనకు ఎప్పుడైనా ఏదైనా నిర్మించే అవకాశం వస్తే మాత్రం తాను మొదట చేసేది అదే అని అతడు స్పష్టం చేశాడు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళంలో ఇది చేయడం చాలా సులువు అని కూడా నాని అన్నాడు.

అక్కడి ఏ ప్రొడ్యూసర్ అయినా సులువుగా ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులను ఒక్కచోట చేర్చగలడని అతడు అభిప్రాయపడ్డాడు. ప్రతి పాత్రకు సముచిత న్యాయంతో బలమైన స్క్రీన్ ప్లే ఉన్నా కూడా తెలుగు లేదా తమిళంలో అలాంటి నటీనటులను ఒక్కచోట చేర్చడం కష్టమని నాని అన్నాడు.

మలయాళం సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమన్న అతడు.. ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల గురించి ప్రస్తావించాడు. ఆవేశం, భీష్మ పర్వం, ప్రేమలు, ఆడుజీవితంలాంటి సినిమాల్లోని యాక్టర్స్ నటన అద్భతమని కొనియాడాడు.

సరిపోదా శనివారం ప్రమోషన్లు

నాని నటిస్తున్న నెక్ట్స్ మూవీ సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా రానుండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్లలో అతడు పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే మలయాళం వెర్షన్ ప్రమోషన్ల కోసం కొచ్చి వెళ్లాడు.

గతంలో తనతో అంటే సుందరానికి అనే మూవీ తీసిన వివేక ఆత్రేయనే ఈ సరిపోదా శనివారం సినిమాకు డైరెక్టర్. అయితే ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ఓ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ లేటెస్ట్ మూవీని అతడు తెరకెక్కించాడు. మూవీలో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఇక ప్రియాంకా అరుళ్ మోహన్ ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని తీసిన ఇదే నిర్మాత.. పవన్ కల్యాణ్ తో ఓజీని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సరిపోదా శనివారం మూవీకి ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.

అర్షద్ వార్సీపై కామెంట్స్

ఈ మధ్యే హైదరాబాద్ లో సరిపోదా శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడన్న అర్షద్ వార్సీ కామెంట్స్ ను నాని ఖండించాడు. అతనికి ఈ కామెంట్స్ తోనే జీవితంలో రానంత పబ్లిసిటీ వచ్చిందని అన్నాడు.

అయితే ఇప్పుడు తన మూవీ హిందీలోనూ రిలీజ్ కానున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గి.. అర్షద్ వార్సీ మంచి నటుడు అని తన కామెంట్స్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం