Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్-action thriller web series tanaav season 2 trailer released sonyliv ott to stream web series in telugu too ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 08:11 PM IST

Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఇప్పటికే తొలి సీజన్ తో మంచి థ్రిల్ పంచిన ఈ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ మంగళవారం (ఆగస్ట్ 20) రిలీజైంది. కశ్మీరీ ఉగ్రవాదం బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న రెండో సీజన్ కూడా థ్రిల్లింగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Action Thriller Web Series: కశ్మీరీ ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్ ఇప్పుడు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఐసిస్ ఉగ్రవాది అల్ డమిష్క్ లక్ష్యంగా కబీర్ ఫరూఖీ (మానవ్ విజ్), అతని స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేయబోయే సాహసాలను చూపించనున్నారు. తాజాగా మంగళవార (ఆగస్ట్ 20) తనావ్ 2 ట్రైలర్ రిలీజైంది.

తనావ్ 2 ట్రైలర్

తనావ్ అంటే తెలుగులో ఉద్రిక్తత అని అర్థం. ఒకప్పుడు కశ్మీర్ నిత్య ఉగ్రవాదంతో ఎలా ఉద్రిక్త పరిస్థితులు ఉండేవో చెబుతూ ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ మన ముందుకు వచ్చాయి. అలాంటిదే ఈ తనావ్ కూడా. సోనీలివ్ ఓటీటీలో వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సోనీలివ్ లోనే సెప్టెంబర్ 6 నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

దానికి ముందు తనావ్ సీజన్ 2 ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కొత్త సీజన్ లో కశ్మీర్ ఎదుర్కొంటున్న కొత్త సవాలు నుంచి అక్కడి ప్రజలను కబీర్ అండ్ టీమ్ ఎలా రక్షించబోతోందో చూపించబోతున్నారు. ఐసిస్ లో శిక్షణ పొంది.. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవడంతోపాటు మొత్తం ఇండియాను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలన్న లక్ష్యంతో అల్ డమిష్క్ అనే ఉగ్రవాది కశ్మీర్ కు వస్తాడు. వచ్చీ రాగానే ఓ బాంబు దాడితో 12 మంది ప్రాణాలను బలిగొంటాడు. ఆ దాడితోనే అతడు కశ్మీర్ లోకి వచ్చినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ గుర్తిస్తుంది.

ఎవరీ అల్ డమిష్క్?

ఐసిస్ లో శిక్షణ పొంది సిరియా నుంచి కశ్మీర్ వచ్చి ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న ఉగ్రవాదే ఈ అల్ డమిష్క్. స్పెషల్ టాస్క్ గ్రూప్ అతన్ని మట్టుబెడుతుందా? కశ్మీర్, ఇండియా ఎదుర్కొంటున్న ఈ కొత్త ప్రమాదాన్ని అరికడుతుందా అన్న కథాంశంతో తనావ్ సీజన్ 2 తెరకెక్కింది. ఈ కొత్త సీజన్ సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

"ఈసారి ప్రతీకారం వ్యక్తిగతం కానుంది. యాక్షన్ ప్యాక్డ్ తనావ్ సీజన్ 2 చూడండి. సెప్టెంబర్ 6 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కబీర్ తన అత్యంత కఠినమైన ప్రత్యర్థి అల్ డమిష్క్ ను ఎదుర్కోబోతున్నాడు. అతడు కశ్మీర్ ను కాపాడి, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడా? తనావ్ సీజన్ 2 ను అవార్డ్ విన్నింగ్ సుధీర్ మిశ్రా, ఇ. నివాస్ డైరెక్ట్ చేశారు" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ ట్రైలర్ షేర్ చేశారు.

ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ ఫౌదా ఆధారంగా ఈ తనావ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మానవ్ విజ్ తోపాటు గౌరవ్ అరోరా, అర్బాజ్ ఖాన్, సత్యదీప్ మిశ్రా, రజత్ కపూర్, సుఖ్మనీ సాధన, ఏక్తా కౌల్ లాంటి వాళ్లు నటించారు. హిందీతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.