Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-crime thriller web series murshid trailer released to stream in zee5 ott from august 30th kay kay menon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 02:53 PM IST

Crime Thriller Web Series: ఓటీటీలోకి త్వరలోనే మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను మంగళవారం (ఆగస్ట్ 20) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ అనేది మొదటి నుంచీ ఓటీటీలో ఓ హిట్ జానర్. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ మంచి పాపులర్ అయ్యాయి. తాజాగా అలాంటి సిరీసే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ పేరు ముర్షిద్. విలక్షణ నటుడు కే కే మేనన్ బాంబే కా సుల్తాన్ గా పిలిచే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.

ముర్షిద్ వెబ్ సిరీస్ ట్రైలర్

ముంబై అండర్ వరల్డ్ మాఫియాపై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడలాంటిదే మరో వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. కే కే మేనన్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటించిన ముర్షిద్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 20) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఊహించినట్లే రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ ప్రధాన అంశంగా తెరకెక్కిన సిరీస్ గా కనిపిస్తోంది.

మాఫియా డాన్ ముర్షిద్ పఠాన్ గా కే కే మేనన్ పాత్రను పరిచయం చేస్తూ ఈ సిరీస్ ట్రైలర్ మొదలవుతుంది. బాంబే కా సుల్తాన్ గా పేరుగాంచిన ఈ డాన్ మధ్యలో కొన్నాళ్ల పాటు వీటికి దూరంగా ఉండి మరోసారి గన్ను పట్టినట్లు చూపించారు. అతని కొడుకు అదే ముంబై సిటీలో పోలీస్ ఆఫీసర్ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్. మరో గ్యాంగ్ తో ముర్షిద్ గ్యాంగ్ కు వార్ నడుస్తూ ఉంటుంది.

అయితే ముర్షిద్ గ్యాంగ్ కు, మరో గ్యాంగ్ కు మధ్య ఉన్న శతృత్వం ఏంటి? మాఫియాకు దూరంగా ఉన్న ముర్షిద్ మళ్లీ ఎందుకు గన్ పట్టాల్సి వచ్చింది? ఈ రెండు గ్యాంగ్ లలో ఎవరిది పైచేయి అవుతుంది? అన్న ప్రశ్నలకు ఈ వెబ్ సిరీస్ సమాధానం చెప్పనుంది.

ముర్షిద్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

ముర్షిద్ వెబ్ సిరీస్ లో కే కే మేనన్ తోపాటు తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ ముర్షిద్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ఉండే డిమాండ్ నేపథ్యంలో ఈ ముర్షిద్ కూడా ఆకట్టుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన కే కే మేనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్ లోనూ నటించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14 నుంచి ఈ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అతడు ఓ డిటెక్టివ్ పాత్రలో నటించాడు.