OTT Thriller Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్-ott thriller web series ic 814 the kandahar highjack to stream in netflix ott trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

OTT Thriller Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Aug 19, 2024 01:43 PM IST

OTT Thriller Web Series: ఓటీటీలోకి ఇప్పుడు మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్లేన్ హైజాక్ గా భావించే కాందహార్ హైజాక్ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 19) రిలీజ్ అయింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

OTT Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇండియన్ ఏవియేషన్ చరిత్ర దశ దిశను మార్చేసిన ఓ హైజాక్ నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. 189 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం హైజాకర్ల బారిన పడిన భయానక ఘటన ఆధారంగా తెరకెక్కిన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ ట్రైలర్

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే మరో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచడం ఖాయంగా కనిపిస్తోంది. 25 ఏళ్ల కిందట అంటే 1999లో జరిగిన హైజాక్ ఘటన దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. అలాంటి ఘటనను ఆధారంగా చేసుకొని వస్తున్న సిరీసే ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్.

ఏడు రోజుల పాటు జరిగిన ఈ హైజాక్ డ్రామా.. ప్రపంచ చరిత్రలో అతి సుదీర్ఘ హైజాక్ కావడం గమనార్హం. దీనిపై రూపొందిన సిరీస్ కూడా ఎంతో ఆసక్తి రేపేలా సాగబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అప్పటి హైజాక్ ఘటన తెర వెనుక ఏం జరిగిందన్నది ఇందులో చూపించబోతున్నారు. అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ఫ్టైల్ ఇన్‌టూ ఫియర్ ఆధారంగా తెరకెక్కింది.

హైజాక్ డ్రామా ఇలా..

హైజాక్ సమయంలో ఢిల్లీలోని వార్ రూమ్ లో జరిగిన ఘటనలను ఈ పుస్తకం కళ్లకు కట్టింది. మొదట అమృత్‌సర్ కి విమానాన్ని తీసుకెళ్లిన హైజాకర్లు.. తర్వాత దానిని కాందహార్ కు ఎందుకు తరలించారు? అందులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా ఈ సిరీస్ లో చూపించబోతున్నారు.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులు నటించారు. నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, పత్రలేఖ, కుముద్ మిశ్రా, దిబ్యేందు భట్టాచార్యలాంటి వాళ్లు ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ నటీనటులను పరిచయం చేస్తూ గతంలోనే నెట్‌ఫ్లిక్స్ ఓ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేసింది.

తాజా ట్రైలర్ తో ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా?