Crime Thriller OTT: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-telugu crime thriller movie double engine streaming now on sun nxt ott after aha release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller Ott: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Crime Thriller OTT: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 16, 2024 06:51 PM IST

Double Engine OTT Streaming: డబుల్ ఇంజిన్ సినిమా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా గతంలోనే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తాజాగా ఈ డబుల్ ఇంజిన్ చిత్రం మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది.

Crime Thriller OTT: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Crime Thriller OTT: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ‘డబుల్ ఇంజిన్’ చిత్రం ఈ ఏడాది జనవరి 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చింది. అయితే, ప్రశంసలు దక్కినా కమర్షియల్‍గా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సక్సెస్ కాలేకపోయింది. డబుల్ ఇంజిన్ చిత్రంలో ముని మ్యాత్రి, అజిత్ మోహన్, రోహిత్ నరసింహ, శ్రీనివాస్ వరంగి, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు.

డబుల్ ఇంజిన్ సినిమా మార్చిలోనే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

రెండో ఓటీటీలో..

డబుల్ ఇంజిన్ సినిమా తాజాగా సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నేటి నుంచి ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ చిత్రం ఆహా, సన్‍నెక్స్ట్ ఇలా రెండో ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

డబుల్ ఇంజిన్ సినిమాకు రోహిత్ పెనుమత్స దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ వాతారణాన్ని రియలస్టిక్‍గా చూపించారనే ప్రశంసలు వచ్చాయి. రెండు తలల పామును పట్టుకొని డబ్బు చేసుకోవాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల స్టోరీతో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఆయన తెరకెక్కించారు. ఈ మూవీకి రోహిత్ - శశి కథను అందించారు.

డబుల్ ఇంజిన్ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు వివేక్ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్‍గా నిలిచింది. పాటలతో పాటు బ్యాక్‍గ్రౌండ్ స్కోరు కూడా అదరగొట్టారు. అయితే, పెద్దగా ప్రమోషన్లు లేక ఈ చిత్రం ఎక్కువ మందికి చేరువకాలేకపోయింది. ఈ చిత్రాన్ని వాల్తేర్ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాపల్లి నిర్మించారు. శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి అవంతి రుయా ఎడిటింగ్ చేశారు.

డబుల్ ఇంజిన్ మూవీ స్టోరీ

హైదరాబాద్‍లో ఆటో డ్రైవర్‌గా పని చేసే డానీ (ముని మ్యాత్రి).. తన పుట్టిన రోజును స్నేహితులతో కలిసి చేసుకునేందుకు సొంత ఊరు తాటిపల్లికి వస్తాడు. తన స్నేహితుడు గోపీ (బాచి అజిత్) ద్వారా రెండు తలల పాము (డబుల్ ఇంజిన్ స్నేక్) గురించి తెలుసుకుంటాడు. దాన్ని పట్టుకొని అమ్మితే భారీగా డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ చేసుకుంటారు. మరో ఫ్రెండ్ నర్సింగ్ (రోహిత్ నరసింహ)తో కలిసి ఆ పామును దొరికించుకోవాలని డానీ సిద్ధమవుతాడు. ఇందుకోసం పాములు పట్టే మౌళి (రాజు శివరాత్రి)ని వెంట తీసుకెళతారు. రెండు తలల పామును పట్టుకోవాలన్న డాని, అతడి స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఎలాంటి కష్టాలు పడ్డారు? ఆ పామును వారు పట్టుకోగలిగారా? అనేదే డబుల్ ఇంజిన్ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.