Nani Arshad Warsi: ప్రభాస్‌ను జోకర్ అన్న బాలీవుడ్ హీరోకి గట్టిగానే ఇచ్చుకున్న నాని.. వీడియో వైరల్-nani reacted strongly to arshad warsi comments on prabhas dil raju also reacted ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Arshad Warsi: ప్రభాస్‌ను జోకర్ అన్న బాలీవుడ్ హీరోకి గట్టిగానే ఇచ్చుకున్న నాని.. వీడియో వైరల్

Nani Arshad Warsi: ప్రభాస్‌ను జోకర్ అన్న బాలీవుడ్ హీరోకి గట్టిగానే ఇచ్చుకున్న నాని.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Aug 21, 2024 06:48 PM IST

Nani Arshad Warsi: కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడన్న బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీకి కాస్త గట్టి కౌంటరే ఇచ్చాడు తెలుగు హీరో నాని. అతనితోపాటు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా దీనిపై తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడీ ఇద్దరి వీడియో వైరల్ అవుతోంది.

ప్రభాస్‌ను జోకర్ అన్న బాలీవుడ్ హీరోకి గట్టిగానే ఇచ్చుకున్న నాని.. వీడియో వైరల్
ప్రభాస్‌ను జోకర్ అన్న బాలీవుడ్ హీరోకి గట్టిగానే ఇచ్చుకున్న నాని.. వీడియో వైరల్

Nani Arshad Warsi: సౌత్ సినిమాలు అన్నా, ఇక్కడి హీరోలు అన్నా నార్త్ వాళ్లకు ఇప్పటికీ చిన్న చూపే అనడగానికి ఈ మధ్యే బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీ చేసిన కామెంట్సే నిదర్శనం. కల్కి 2898 ఏడీ మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ పెద్ద హిట్ అయినా.. ఈ మూవీ తనకు నచ్చలేదని, ఇందులో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడని అతడు అన్నాడు. అయితే దీనిపై తాజాగా నేచురల్ స్టార్ నాని చాలా స్ట్రాంగా రియాక్ట్ అయ్యాడు.

అర్షద్ వార్సీ కామెంట్స్‌పై నాని రియాక్షన్

నాని తన నెక్ట్స్ మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా బుధవారం (ఆగస్ట్ 21) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అర్షద్ వార్సీ ఈ మధ్యే ప్రభాస్ పై నోరు పారేసుకున్న విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి అడిగాడు. "ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నాగానీ.. మన హీరోల మీద ఓ చిన్నచూపు చూపిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభాస్ గారి మీద.." అంటూ అడగబోయాడు.

ఆ సమయంలో నాని పక్కనే ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ప్రశ్న పూర్తి కాక ముందే కాస్త తీవ్రంగా స్పందించాడు. "ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారమ్మా.. ఇప్పుడు నువ్వే అన్నావ్ సౌత్ టాప్ లో ఉందని, ప్రపంచమంతా తెలుసు అది. ఎవరో ఒకరన్నదాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి" అని దిల్ రాజు అన్నాడు.

అప్పుడు నాని కూడా స్పందిస్తూ.. "మీరు చెబుతున్న వ్యక్తికి తన జీవితం ఇప్పుడు లభించినంత పాపులారిటీ ఎప్పుడూ దొరికి ఉండదు. అంత ముఖ్యమైన విషయం కాని దానిని మీరు అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు" అని అన్నాడు. అప్పుడు దిల్ రాజు మరోసారి మాట్లాడుతూ.. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని, తనకూ అలాగే తగులుతున్నట్లు నవ్వుతూ చెప్పాడు.

సుధీర్ బాబు కూడా ఇలాగే..

ప్రభాస్ పై అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ కు ఇంతకు ముందు సుధీర్ బాబు కూడా స్పందించాడు. "నిర్మాణాత్మక విమర్శలు చేయడం మంచిదే. కానీ నోరు పారేసుకోవడం సరి కాదు. అర్షద్ వార్సీ నుంచి ఇలా ప్రొఫెషనలిజం లేకుండా మాట్లాడటం నేనెప్పుడూ ఊహించలేదు. అలాంటి చిన్న మెదళ్ల నుంచి వచ్చే కామెంట్స్ తో ప్రభాస్ లాంటి గొప్ప ఇమేజ్ కు ఎలాంటి ఢోకా ఉండదు" అని సుధీర్ బాబు ఘాటుగా బదులిచ్చాడు.

ఈ మధ్యే ఓ పాడ్‌కాస్ట్ లో అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. తాను కల్కి 2898 ఏడీ మూవీ చూశానని, తనకు అస్సలు నచ్చలేదని అన్నాడు. ప్రభాస్ మరీ జోకర్ లా కనిపించాడని, ఎందుకిలా చేస్తారని ప్రశ్నించాడు. అదే సమయంలో ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటన మాత్రం అద్భుతమని కొనియాడాడు. అతని కామెంట్స్ వైరల్ అవడంతో సౌత్ నుంచి ఇప్పుడు ఘాటు విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మరోవైపు ప్రభాస్ నటించిన ఈ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు.. నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కాబోతోంది.