తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Dasara Movie First Single Dhoom Dhaam Dostana To Release On This Date

Nani Dasara First Single Release Date: ద‌స‌రా ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ హంగామా మొద‌ల‌య్యేది ఆ రోజే

01 October 2022, 11:23 IST

  • Nani Dasara First Single Release Date: నాని ద‌స‌రా సినిమా నుంచి కొత్త అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ శ‌నివారం అనౌన్స్ చేశారు.
నాని
నాని (Nani/Twitter)

నాని

Nani Dasara First Single Release Date: నాని ద‌స‌రా సినిమా ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. కెరీర్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో నాని న‌టిస్తున్న సినిమా ఇది. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ధ‌స‌రా సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ దామ్ దోస్తాన్‌ను అక్టోబ‌ర్ 3న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

నాని కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఫుల్ మాస్ అవ‌తారంలో నాని క‌నిపిస్తున్నాడు. లుంగీ ధ‌రించి దుమ్ముతో నిండిపోయి అత‌డు క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కోల్ మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట‌లో నాని డ్యాన్సులు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది. ద‌స‌రా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎమ్‌సీఏ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ (Keerthy suresh) జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది.

అంతేకాకుండా నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా 2023 మార్చి 30 రిలీజ్ చేయ‌బోతున్నారు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.