Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ఛేంజ్- ప్రశాంత్ వర్మ కాదు నాగ్ అశ్విన్ ఫిక్స్ -పుకార్లపై క్లారిటీ
19 December 2024, 8:39 IST
Mokshagna: Teja: బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ ఆగిపోయినట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ స్థానంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై క్లారిటీ వచ్చేసింది.
మోక్షజ్ఞ తేజ
Mokshagna: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞ తేజ ఫస్ట్ మూవీకి కల్కి 2898 ఏడీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ప్రొడక్షన్ హౌజ్ క్లారిటీ ఇచ్చింది. మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోలేదని అన్నది. మరోవైపు కల్కి డైరెక్టర్‌తో మోక్షజ్ఞ తేజ సినిమా చేస్తున్నాడని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని తెలిసింది.
బర్త్ డే రోజు...
నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీని అతడి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌లో అనౌన్స్‌చేశారు. హనుమాన్‌తో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా లాంఛ్ కావాల్సింది. లాంఛింగ్ డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు.
అనారోగ్యం వల్లే...
మోక్షజ్ఞ అనారోగ్యం వల్లే మూవీ లాంఛింగ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు బాలకృష్ణ చెప్పాడు.కానీ పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన కథ మోక్షజ్ఞతో పాటు బాలకృష్ణకు నచ్చలేదని, అందుకే ఓపెనింగ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు వినిపిస్తోన్నాయి. ఇన్నాళ్లు ప్రశాంత్ వర్మతో పాటు మూవీ టీమ్ కూడా ఈ పుకార్లపై రెస్పాండ్ కాకపోవడంతో ఆ వార్తలు నిజమేనని నందమూరి అభిమానులు భావించారు.
అసత్యాల్ని నమ్మోద్దు...
ఈ రూమర్లపై చిన్న నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ క్లారిటీ ఇచ్చింది. మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాపై వస్తోన్న ఊహాగానాల్లో నిజం లేదని తెలిపింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌నురివీల్ చేస్తామని, అసత్యాల్ని నమ్మవద్దని, ప్రచారం చేయద్దని తెలిపింది.
కల్కి డైరెక్టర్‌తో...
మరోవైపు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో మోక్షజ్ఞ తేజ ఫస్ట్ మూవీ దర్శకత్వం వహించబోతున్నట్లు కొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారంజరుగుతోంది. ఈ పుకార్లలో నిజం లేదని తెలిసింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ స్కిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడని, కల్కి 2ను పూర్తి చేయడానికే మరో రెండు, మూడేళ్లు టైమ్ పడుతుందని సమాచారం.
అప్పటివరకు ఇతర హీరోలతో అతడు సినిమా చేసే అవకాశం లేదని అంటున్నారు. ప్రశాంత్ వర్మ మూవీతో పాటు ఆదిత్య 369 సీక్వెల్‌లో మోక్షజ్ఞ నటించబోతున్నాడు. ఈ సినిమాకు బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడు.