Nagarjuna Legal Notice: కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు.. సమంతను మంత్రి పొగిడారు, సారీ దేనికి.. ఆర్జీవీ కామెంట్స్
03 October 2024, 16:05 IST
Nagarjuna Legal Notice To Konda Surekha Over Samantha Issue: మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు పంపించనున్నారని సమాచారం. అలాగే, కొండా సురేఖపై రామ్ గోపాల్ వర్మ వరుసగా స్పందిస్తూనే ఉన్నారు. సమంతకు కొండా సురేఖ ఎందుకు సారీ చెప్పాలి అని ఆర్జీవీ మాట్లాడిన ఓ వాయిస్ నోట్ వైరల్ అవుతోంది.
కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు.. సమంతకు మంత్రి సారీ ఎందుకు చెప్పాలి.. ఆర్జీవీ కామెంట్స్
RGV On Konda Surekha Samantha Issue: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తీవ్ర దుమారం లేపుతున్నాయి. సమంతపై మంతి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కతాటిపైకి వచ్చింది. అంతా సమంత, నాగార్జున కుటుంబానికి అండగా ట్వీట్స్ చేస్తున్నారు.
సురేఖకు కౌంటర్
#FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌తో సమంతకు మద్దతుగా యావత్ తెలుగు సినీ సెలబ్రిటీలు ఎక్స్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతూ ట్వీట్ చేశారు. మొదట సురేఖకు గట్టి కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ తర్వాత తన స్టైల్‌లో కొత్త వెర్షన్ వినిపించారు.
రామ్ గోపాల్ వర్మ వాయిస్‌తో సోషల్ మీడియాలో ఓ వాయిస్ నోట్ వైరల్ అవుతోంది. ఇందులో "సమంతకు కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పటమెంటి? దీనికన్నా స్టుపిడిటీ నా జీవితంలో నేను చూడలేదు. ఫస్ట్ సమంతను ఎక్కడ అవమానించారు. అక్కడ అవమానించలా.. నిజానికి ఆమెను పొగిడారు" అని రామ్ గోపాల్ వర్మ వాయిస్ నోట్‌లో చెప్పారు.
సమంతను పొగిడినట్లు
"అక్కడ ఆవిడ ఏమంటున్నారు. నాగార్జున, నాగ చైతన్య.. ఇద్దరూ కలిసి ఒక మామగా, ఒక భర్తగా.. ఒక కోడలిని, ఒక భార్యను తనకున్న ఆస్తిని కాపాడుకోడానికి వెళ్లమని ఫోర్స్ చేస్తే తను (సమంత) కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది అని. అక్కడ సమంతకు ఎక్కడ అవమానం జరిగింది. అక్కడ సమంతను పొగిడినట్లు యాక్చువల్‌గా" అని ఆర్జీవీ అన్నారు.
"అవమానించింది ఎవరినీ.. అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా. దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లడట్లేదు. ఇలాంటివి చెప్పడం కన్నా.. అక్కినేని కుటుంబానికి ఉన్న హుందాతనం, రెప్యుటేషన్ అది ఒక్కసారి పక్కన పెట్టి.. ఏ ఇంట్లో అయిన ఏ మామపై, భర్తపై ఇలాంటి ఆరోపణలు అయితే నేను నా జీవితంలో వినలేదు" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
ఆర్జీవీ రిక్వెస్ట్
"ఇది చాలా సీరియస్‌గా తీసుకుని, ఇలా వదిలేయకుండా.. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరికోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్‌గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి అని నాగార్జునకు, నాగ చైతన్యకు నా రిక్వెస్ట్. దీనికి తప్పిస్తే మన దగ్గర మరో మార్గం లేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి" అని ఆర్జీవీ మాట్లాడిన వాయిస్ నోట్ వైరల్ అవుతోంది.
అలాగే, ఈ విషయంపై ఎక్స్‌లో ఆర్జీవీ ట్వీట్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే, తన ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నాగార్జున లీగల్ యాక్షన్ తీసుకోనున్నారని సమాచారం. ఈ విషయంపై మంత్రికి లీగల్ నోటీసులు పంపించనున్నారట నాగార్జున.
నాగార్జున లీగల్ నోటీసులు
ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే, మంత్రి కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదని, చట్టపరంగా పోరాడతానని నాగార్జున వెల్లడించినట్లు సమాచారం.
టాపిక్