Vyooham Review: వ్యూహం రివ్యూ.. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఫలించిందా? మూవీ ఎలా ఉందంటే?-ram gopal varma vyooham review and rating in telugu ajmal ameer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Gopal Varma Vyooham Review And Rating In Telugu Ajmal Ameer

Vyooham Review: వ్యూహం రివ్యూ.. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఫలించిందా? మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 02, 2024 04:30 PM IST

Ram Gopal Varma Vyooham Review In Telugu: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన సినిమా వ్యూహం. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు శనివారం థియేటర్లలో వ్యూహం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో వ్యూహం రివ్యూలో చూద్దాం.

వ్యూహం రివ్యూ.. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఫలించిందా? మూవీ ఎలా ఉందంటే?
వ్యూహం రివ్యూ.. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఫలించిందా? మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: వ్యూహం

నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, ధనంజయ్ ప్రభునే, కోట జయరాం, రేఖా నిరోషా తదితరులు

రచన, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

ప్రొడక్షన్: రామదూత క్రియేషన్స్

నిర్మాత: దాసరి కిరణ్ కుమార్

సంగీతం: ఆనంద్

సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్

ఎడిటింగ్: మనీష్ ఠాకూర్

రిలీజ్ డేట్: మార్చి 2, 2024

RGV Vyooham Review Telugu: కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన మరో పొలిటికల్ మూవీ వ్యూహం. మొదటి నుంచే పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ద్వారా క్యూరియాసిటీ పెంచేసిన వ్యూహం ఏపీ పాలిటిక్స్‌పై తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, కోర్ట్ కేసులు దాటి ఎట్టకేలకు వ్యూహం మూవీ శనివారం (మార్చి 2) థియేటర్లలో విడుదలైంది. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఏపీ ముఖ్యమంత్రి వీఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారు. దాంతో అతని కుమారుడు మదన్ రెడ్డి (అజ్మల్ అమీర్)ని సీఎం చేయాలని సదరు పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు. కానీ, అదంతా పక్కన పెట్టి కాశయ్యకు ఏపీ ముఖ్యమంత్ర పదవి అప్పజెపుతుంది హైకమాండ్. అనంతరం తండ్రి మరణ వార్త విని చనిపోయిన ప్రజల కోసం మదన్ యాత్రలు చేస్తుంటాడు. అది ఇష్టం లేని ప్రతిపక్షాలు, హై కమాండ్ వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తాయి.

హైలెట్స్

ఈ క్రమంలోనే మదన్‌పై కేసులు, సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లు మొదలవుతాయి. అనంతరం అరెస్ట్ అయి జైలుకు వెళతాడు మదన్. మరి అరెస్ట్ అయిన మదన్ ఎలాంటి బాధలు అనుభవించాడు? ప్రతిపక్ష నేత తారా ఇంద్రబాబు నాయుడు (ధనుంజయ్ ప్రభునే)ను ఎలా ఎదుర్కొని ఏపీకి సీఎం అయ్యాడు? ఎన్నికల్లో ఎలా గెలిచాడు? ఈ క్రమంలో భార్య మాలతి రెడ్డి (మానస రాధాకృష్ణన్), తల్లి జయమ్మ (సురభి ప్రభావతి), చెల్లెలు నిర్మల (రేఖా నిరోషా) ఎలాంటి సహకారం అందించారు? శ్రవణ్ కల్యాణ్ (చింటూ) పాత్ర ఏంటీ? అనేదే వ్యూహం సినిమా కథ.

విశ్లేషణ:

వ్యూహం పేరుకు సినిమా అయినా అది ఎవరిపై తెరకెక్కించారో పాత్రల పేర్లు, వారి వైఖరి, రూపు రేఖలు చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి సినిమాలో చూపించి పాత్రల పేర్లు కాకుండా రియల్ లైఫ్ పాత్రలు ఏంటనేది తెలిసిందే. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించడానికి గల లక్ష్యం ఏంటి అనేది ట్రైలర్, పోస్టర్స్ చూస్తే చాలు.

ఇక వ్యూహం సినిమాలోకి వెళితే.. వైఎస్సార్ మరణాంతరం ఏపీ ప్రజల భావోద్వేగాలను, ఓ ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది, ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతుంది అనే అంశాలను బాగానే చూపించారు. తండ్రి బాటలో నడవాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ పడిన ఇబ్బందులు, అప్పడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బెదిరింపులు, వాటిని ఎదుర్కుని నిలబడిన తీరును బాగానే ఆవిష్కరించారు. కొన్ని సింబాలిక్ సీన్స్, షాట్స్ బాగున్నాయి.

సెటైర్లు

దాదాపుగా జగన్ జీవితంలో, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన అన్ని విషయాలనే వ్యూహంలో చూపించారు. అయితే, కొన్ని విషయాలు తెలియనివి ఉన్నాయి. అవి సినిమా చూసే తెలుసుకోవాలి.

ఇక నారా లోకేష్ పాత్రను ఒక స్ఫూఫ్ లాగా, కామెడీ తరహాలో చూపించే ప్రయత్నం చేశారు. అందులో సీరియస్‌నెస్ లేదు. మెగా బ్రదర్స్ మధ్య కన్వర్జేషన్ నెగెటివిటీ తెచ్చుకునే విధంగా ఉంది. పవన్ కల్యాణ్ పుస్తకాలు చదవడంపై సెటైర్లు పడ్డాయి.

అయితే, దాదాపుగా అందరికీ తెలిసిన కథే కాబట్టి కథనం ఎంగేజింగ్‌గా ఉంటే బాగుండేది. స్లో నెరేషన్‌ వల్ల సినిమా బోరింగ్ ఫీల్ తెప్పించినట్లయింది. మధ్యలో వచ్చే పాటలు వైసీపీ నేతల్లో మంచి జోష్ నింపేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక మదన్ పాత్రలో అజ్మల్ అమీర్ బాగా నటించాడు. ఒరిజినల్ పాత్రకు సంబంధించిన పర్ఫెక్ట్ హావాభావాలతో చాలా సహజంగా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే మానస రాధాకృష్ణన్ నటన బాగుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే..

నిజానికి ప్రతి పాత్ర రియల్ లైఫ్ పాత్రలకు బాగా సెట్ అయ్యాయి. వాళ్ల నటన కూడా దాదాపు అలాగే నటించేందుకు ప్రయత్నించారు. ఫైనల్‌గా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం రాజశేఖర్ రెడ్డి, జగన్, వైసీపీ అభిమానులు ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మిగిలిన ప్రేక్షకులు టైమ్ పాస్ మూవీలా ఎంటర్టైన్ అవ్వొచ్చు.

రేటింగ్: 2.5/5

IPL_Entry_Point