తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Shaurya Wedding On November 20th With Anusha In Bangalore

Naga Shaurya Wedding: ఇంటివాడు కాబోతున్న నాగ శౌర్య.. పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

HT Telugu Desk HT Telugu

10 November 2022, 15:27 IST

    • Naga Shaurya Wedding: ఇంటివాడు కాబోతున్నాడు టాలీవుడ్‌ యువ నటుడు నాగ శౌర్య. అతని పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ అయింది. బెంగళూరులో అతని పెళ్లి జరగనుంది.
టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య
టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య

టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య

Naga Shaurya Wedding: టాలీవుడ్‌ యువ నటుడు నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యే కృష్ణ వ్రిందా విహారీ మూవీలో కనిపించిన ఈ హ్యాండ్సమ్‌ హీరో తన బ్యాచిలర్‌హుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నవంబర్‌ 20వ తేదీన అతని పెళ్లి బెంగళూరులో జరగనుంది. అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష.

ట్రెండింగ్ వార్తలు

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

Prasanth Varma PVCU: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్.. జై హనుమాన్‌లో నటించే అవకాశం!

Netflix Top Trending Movies Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ

అతని పెళ్లి పనులు మొత్తం బెంగళూరులోనే జరగనున్నాయి. నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బెంగళూరులోని విటల్‌ మాల్యా రోడ్డులో ఉన్న జేడబ్ల్యూ మారియట్‌ హోటల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ప్రస్తుతం అతని వెడ్డింగ్‌ ఇన్విటేషన్ వైరల్‌ అవుతోంది. నవంబర్‌ 20 ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

నవంబర్‌ 19న జరగబోయే మెహందీ వేడుకలతో పెళ్లి సంబరం మొదలుకానుంది. రెండు రోజుల పాటు కన్నుల పండువగా వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది. 2011లో క్రికెట్‌ గర్ల్స్‌ అండ్‌ బీర్‌తో సినిమాల్లోకి వచ్చినా 2014లో ఊహలు గుసగుసలాడే మూవీతో పాపులర్‌ అయ్యాడు నాగ శౌర్య. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్యుతానంద, చలో, వరుడు కావలెనులాంటి మూవీలతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.