తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya Sobhita Dhulipala Wedding: ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్య-శోభిత.. ముహూర్తం ఎప్పుడంటే?

Naga Chaitanya Sobhita Dhulipala Wedding: ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్య-శోభిత.. ముహూర్తం ఎప్పుడంటే?

Galeti Rajendra HT Telugu

04 December 2024, 15:04 IST

google News
  • Naga Chaitanya Wedding Time: శోభిత ధూళిపాళ్లతో ఈరోజు వివాహ బంధంలోకి నాగచైతన్య మరోసారి అడుగుపెట్టబోతున్నాడు. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఇరు వైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటోంది. 

శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య
శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య

శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొన్ని గంటల్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు (డిసెంబరు 4) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభితలా వివాహం జరగనుంది.

అతిథుల జాబితా ఇదే

అక్కినేని, ధూళిపాళ్ల, దగ్గుబాటి ఫ్యామిలీస్‌తో పాటు పరిమిత సంఖ్యలో సన్నిహితులు, అతిథుల్ని మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యామిలీస్‌తో రాబోతున్నారు. అలానే పీవీ సింధు, డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివాహ మండపంలో బుధవారం రాత్రి 8.13 గంటలకి శోభిత ధూళిపాళ్ల ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య తాళి కట్టబోతున్నారు. స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఎదురుగా ఈ పెళ్లి వేదికని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నూతన వధూవరులకి ఏఎన్నార్ ఆశీర్వాదాలు ఉండాలని ఇలా ఏర్పాటు చేశారట.

శోభిత ఎప్పటికప్పుడు అప్‌డేట్స్

పెళ్లికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను గత కొన్ని రోజులుగా శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. మంగళ స్నానాలు, హల్దీ ఫొటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి.

నాగచైతన్య సైలెన్స్

నాగచైతన్య మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. 2017లో సమంతని వివాహం చేసుకున్న నాగచైతన్య.. 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అక్కినేని అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకోవడంతో.. అతని వివాహం కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

తదుపరి వ్యాసం