తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Profitable Telugu Movie 2024: పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Most Profitable Telugu Movie 2024: పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Hari Prasad S HT Telugu

20 December 2024, 12:28 IST

google News
    • Most Profitable Telugu Movie 2024: పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నా.. 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన తెలుగు సినిమా మాత్రం అది కాదు. ఇప్పటికే రూ.1500 కోట్లకుపైగా గ్రాస్ వసూల్లు సాధించిన అల్లు అర్జున్ మూవీ.. ఆ రికార్డుకు చాలా దూరంలోనే ఉంది.
పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?
పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Most Profitable Telugu Movie 2024: తెలుగు సినిమా మరచిపోలేని ఏడాది 2024. మొత్తం ప్రపంచమే టాలీవుడ్ వైపు చూసేలా హనుమాన్, కల్కి 2898 ఏడీ, పుష్ప 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 మూవీ అయితే ఇప్పటి వరకూ ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. మరి 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన తెలుగు మూవీ ఏది? అందరూ అనుకుంటున్నట్లు పుష్ప 2 అయితే కాదు.

అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా

2024లో అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా హనుమాన్. ఈ జాబితాలో పుష్ప 2 మూడో స్థానంలో ఉండటం విశేషం. ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 14 రోజుల్లో రూ.988 కోట్ల షేర్ సాధించింది. అయితే బడ్జెట్ కంటే 97.75 శాతం అధికంగా వచ్చాయి. ఇవే ఆ మూవీ తొలి రెండు వారాల్లో సాధించిన లాభాలు.

15, 16 రోజులు కూడా కలుపుకుంటే ఈ లాభాలు 100 శాతం దాటుతాయి. అయినా కూడా 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన మూవీగా పుష్ప 2 నిలవదు. బడ్జెట్, లాభాల పరంగా చూస్తే అత్యధిక శాతం లాభాలు పొందిన మూవీ హనుమాన్. ఈ మూవీకి రూ.201 కోట్ల షేర్ లభించింది. అంటే ఏకంగా 235 శాతం లాభాలు అన్నమాట. హనుమాన్ తర్వాత సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లూ స్క్వేర్ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాకు 109 శాతం లాభాలు వచ్చాయి. పుష్ప 2 మూవీ త్వరలోనే ఈ రికార్డును బ్రేక్ చేయనున్నా.. హనుమాన్ రికార్డు బ్రేక్ చేయాలంటే మాత్రం ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంటుంది.

ఈ సినిమాల తర్వాత నాలుగో స్థానంలో చిన్న మూవీ ఆయ్ 72.75 శాతం లాభాలతో ఉంది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ కు 33.09 శాతం, మత్తు వదలరా 2కి 24.88 శాతం, కల్కి 2898 ఏడీ మూవీకి 8.87 శాతం లాభాలు వచ్చాయి.

పుష్ప 2 రికార్డులు

పుష్ప 2 మూవీ 14 రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్ వసూల్లు సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. అయితే భారీ బడ్జెట్ కావడంతో లాభాల శాతం పరంగా చూస్తే.. 2024లో బిగ్గెస్ట్ హిట్ తెలుగు సినిమాగా నిలవలేకపోతోంది. మొదటి నుంచీ అత్యంత వేగంగా రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల రికార్డులను కూడా పుష్ప 2 తిరగరాసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియాలో మరో లెవెల్ కు తీసుకెళ్లింది. తెలుగు కంటే హిందీలోనే మూవీ ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. ఇప్పటికే ఇండియాలోనే హిందీ వెర్షన్ రూ.600 కోట్లకుపైగా వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ మూవీగా నిలిచింది. ముంబై సర్కిల్లోనే గతంలో ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రీతిలో రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. పుష్ప 2 రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

తదుపరి వ్యాసం