తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Michael Ott Release Date: మైఖేల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Michael OTT Release Date: మైఖేల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

04 February 2023, 12:52 IST

  • Michael OTT Release Date సందీప్‌కిష‌న్ మైఖేల్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రంజిత్ జ‌య‌కొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

సందీప్‌కిష‌న్ మైఖేల్
సందీప్‌కిష‌న్ మైఖేల్

సందీప్‌కిష‌న్ మైఖేల్

Michael OTT Release Date సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన మైఖేల్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను ద‌క్కించుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

Tollywood: నాగ‌చైత‌న్య మూవీతో తెలుగులో హీరోయిన్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కెరీర్ ప్రారంభం కావాల్సింది...కానీ

Aavesham OTT Release Date: ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్.. రూ.150 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రంజిత్ జ‌య‌కొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మీన‌న్‌, వ‌రుణ్ సందేశ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

గ్యాంగ్‌స్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంతో ముంబాయిలో అడుగుపెట్టిన ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఓ అమ్మాయితో ప్రేమ కార‌ణంగా అత‌డి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌న్న‌ది యాక్ష‌న్‌...ఎమోష‌న‌ల్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించారు.

సందీప్‌కిష‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఒకేరోజు ఈ సినిమాను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నా క‌థ విష‌యంలోనే ఈ సినిమాపై విమ‌ర్శ‌లొస్తున్నాయి.

కేజీఎఫ్‌, నాయ‌కుడుతో పాటు గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశాల‌తో రూపొందిన ప‌లు సినిమాల స్ఫూర్తితో మైఖేల్‌ను తెర‌కెక్కించిన‌ట్లు ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.