Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ మూవీతో మీనాక్షి చౌదరిలో మొదలైన కొత్త భయం.. ఇకపై అలా నటించదట
01 December 2024, 19:41 IST
Meenakshi Chaudhary New Movies: లక్కీ భాస్కర్ మూవీతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షి చౌదరి.. ఆ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాత్రం ఇప్పుడు భయపడుతోంది. దానికి కారణం ఏంటంటే?
మీనాక్షి చౌదరి
Lucky Baskhar OTT release: దుల్కర్ సల్మాన్‌తో కలిసి మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. గత వారం ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ మూవీ.. అదే జోరుని కొనసాగిస్తూ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే.. ఈ మూవీలో తాను పోషించిన పాత్రపై మీనాక్షి చౌదరిలో కొత్త భయం మొదలైందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నటి స్వయంగా చెప్పింది.
తల్లి, గృహిణి పాత్రలకి నో
లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా నటించగా.. అతని భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా మీనాక్షి చౌదరి కనిపించింది. తన నటనతో మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌ని మెప్పించినప్పటికీ.. మీనాక్షి చౌదరి ఆ డీగ్లామర్ పాత్ర గురించి భయపడుతోందట. దాంతో ఇకపై తల్లి, మిడిల్ క్లాస్ భార్య పాత్రల్లో నటించకూడదని ఈ ముద్దుగుమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌ని భయపెడుతున్న సన్నిహితులు
వాస్తవానికి లక్కీ భాస్కర్‌లో అన్నింటికీ సర్దుకుపోయే మధ్య తరగతి గృహిణిగా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులే పడ్డాయి. కానీ.. ఒక్కసారి అలాంటి పాత్ర చేస్తే.. ఇండస్ట్రీలో ఆ పాత్రలకే పరిమితం చేస్తారని మీనాక్షి చౌదరని ఆమె స్నేహితులు, సన్నిహితులు భయపెడతున్నారట. అక్క, అమ్మ పాత్రలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని.. ప్రస్తుతానికి కమర్షియల్ హీరోయిన్ పాత్రలకి తాను ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.
లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తర్వాత వరుణ్‌తేజ్‌తో మీనాక్షి చౌదరి నటించిన మట్కా సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. ఆ వెంటనే విశ్వక్ సేన్‌తో కలిసి ఆమె నటించిన మెకానిక్ రాకీ కూడా బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
సంక్రాంతికి వస్తున్నాంపై మీనాక్షి చౌదరి ఆశలు
సీనియర్ హీరో వెంకటేశ్‌తో కలిసి మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది.