తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa: కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు.. 12 జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

Kannappa: కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు.. 12 జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

Sanjiv Kumar HT Telugu

25 October 2024, 16:40 IST

google News
  • Manchu Vishnu Mohan Babu Visits Kedarnath Badrinath: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లను సందర్శించారు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు. 12 జ్యోతిర్లింగాలను సందర్శనలో భాగంగా కన్నప్ప మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది.

కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు.. 12 జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్
కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు.. 12 జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు.. 12 జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

Manchu Vishnu Mohan Babu 12 Jyotirlingas: ప్రముఖ నటుడు మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్, నటుడు అర్పిత్ రంకాతో కలిసి కేదార్‌నాథ్, బద్రీనాథ్ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ బృందం దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.

తండ్రీకొడుకుల ప్రార్థనలు

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ సందర్శించింది. ఆ తర్వాత బద్రీనాథ్‌లో మంచు విష్ణు, మోహన్ బాబు ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ సందర్భంగా సందర్శనానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను మంచు విష్ణు పంచుకున్నారు.

12 జ్యోతిర్లింగాలను దర్శించాలని

"కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా కన్నప్ప చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ఎపిక్ యాక్షన్ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని హీరో మంచు విష్ణు తెలిపారు.

ప్రతిష్టాత్మక చిత్రంగా

ఇక మంచు విష్ణు, మంచు మోహన్ బాబు యాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, మంచు విష్ణు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా కన్నప్ప. దీనికి సంబంధించిన కన్నప్ప ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదల అయింది. కన్నప్ప టీజర్, ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది.

న్యూజిలాండ్‌లో షూటింగ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో, ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ చే న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతిలో కన్నప్ప మూవీని చిత్రీకరించారు. దీంతో కన్నప్ప సినిమా విజువల్ వండర్‌గా మంచి అనుభూతి ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు.

భారీ తారాగణం

ఇదిలా ఉంటే, కన్నప్ప సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుతోపాటు అతిపెద్ద భారీ తారాగణం నటిస్తోంది. కన్నప్ప చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

చాలా తక్కువ సమయం

అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కూడా కన్నప్ప సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. కన్నప్ప మూవీ టీజర్‌లో ప్రభాస్‌ను చాలా తక్కువ సమయం చూపించారు. కానీ, దానికి వచ్చిన ఇంపాక్ట్ బాగానే వర్కౌట్ అయింది. వీరందరితోపాటు కన్నప్ప సినిమాలో నటుడు శరత్ కుమార్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

భక్తి, శౌర్యం, ఆధ్యాత్మకం

అలాగే, కన్నప్ప చిత్రంలో బ్రహ్మానందం, అలీ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కన్నప్ప చిత్రాన్ని భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా అభివర్ణించారు మేకర్స్. అయితే కన్నప్ప రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.

తదుపరి వ్యాసం