తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu Ginna Teaser: జిన్నా టైమ్ స్టార్ట్ అయ్యింది - మంచు విష్ణు జిన్నా టీజ‌ర్ రిలీజ్‌

Manchu Vishnu Ginna Teaser: జిన్నా టైమ్ స్టార్ట్ అయ్యింది - మంచు విష్ణు జిన్నా టీజ‌ర్ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu

09 September 2022, 13:52 IST

  • Manchu Vishnu Ginna Teaser: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందంటే...

మంచు విష్ణు
మంచు విష్ణు (twitter)

మంచు విష్ణు

Manchu Vishnu Ginna Teaser: జిన్నా సినిమాతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. బ్యాడ్ టైమ్ కు కేరాఫ్ అడ్రస్ గా టీజర్ లో మంచు విష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. టెంట్ హౌజ్ ఓనర్ గా ఊరి నిండా అప్పులతో జిన్నా సతమతమవుతున్నట్లుగా చూపించడం ఆకట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

మనల్ని అప్పుల నుంచి బయటపడేయాలంటే సాక్షాత్తూ మహాలక్ష్మి పచ్చ బస్సెక్కి నేరుగా మన రంగంపేటలో దిగాలి అంటూ చిత్తూరు యాసలో విష్ణు చెప్పిన డైలాగ్ తో సన్నీ లియోన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపించారు. ఆమె క్యారెక్టర్ తో టీజర్ లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ తో పాటు హారర్ అంశాలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్వకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కరెంట్ తీగ తర్వాత తెలుగులో సన్నీ లియోన్ చేస్తున్న సినిమా ఇది.

జిన్నా సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. జిన్నా సినిమాలో హీరోగా నటిస్తూనే మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు . విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఈ సినిమాలో ఓ పాట పాడారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.