తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్‌ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్‌ -ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌

Malayalam Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్‌ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్‌ -ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌

22 December 2024, 16:47 IST

google News
  • Malayalam Movie: మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ స్వ‌ర్గ‌తిలే క‌త్తురంబు ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ధ్యాన్ శ్రీనివాస‌న్ హీరోగా న‌టించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మలయాళం మూవీ
మలయాళం మూవీ

మలయాళం మూవీ

Malayalam Movie: మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ స్వ‌ర్గ‌తిలే క‌త్తురంబు ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది. పొలిటిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ధ్యాన్ శ్రీనివాస‌న్‌, అంబిక మోహ‌న్‌, మ‌నోహ‌రి జాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జ‌స్పాల్ ష‌ణ్ముగం ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఐఎమ్‌డీబీలో...

ఈ ఏడాది జూన్‌లో స్వ‌ర్గ‌తిలే క‌త్తురంబు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. కాన్సెప్ట్‌, ట్విస్ట్‌లు బాగున్నా స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో థియేట‌ర్ల‌లో మోస్తారు ఆద‌ర‌ణ‌ను ఈ మూవీ ద‌క్కించుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో మాత్రం ఈ మూవీ అద‌ర‌గొట్టింది. 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

స్వ‌ర్గ‌తిలే క‌త్తురంబు క‌థ ఇదే...

జోస్ (ధ్యాన్ శ్రీనివాస‌న్‌) ఉన్న‌త విద్యావంతుడు. వ్య‌వ‌సాయంపై మ‌క్కువ‌తో సొంత ఊరికి వ‌స్తాడు. త‌ల్లి, సోద‌రిగా సంతోషంగా సాగిపోతున్న అత‌డి జీవితం ఊరి ఎలెక్ష‌న్స్ కార‌ణంగా గంద‌ర‌గోళంగా మారుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో పంచాయ‌తీ ఎలెక్ష‌న్స్‌లో పోటీ చేస్తాడు జోస్‌. ఊళ్లో మంచివాడిగా పేరు తెచ్చుకున్న జోస్‌పై క్రిమిన‌ల్‌గా ఎందుకు ముద్ర‌ప‌డింది. రాజ‌కీయ చద‌రంగంలో ప్ర‌త్య‌ర్థులు వేసిన ఎత్తుల కార‌ణంగా ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? ఈ జ‌ర్నీలో అత‌డికి ప్రియురాలు ఆన్సీ ఎలా అండ‌గా నిలిచింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప‌ద‌మూడు సినిమాలు...

మ‌ల‌యాళంలో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు ధ్యాన్ శ్రీనివాస‌న్‌. ఈ ఏడాది ఏకంగా 13 సినిమాలు చేశాడు. వ‌ర్షాంగ్ల‌క్కు శేషం, మ‌ల‌యాలీ ఫ్ర‌మ్ ఇండియ‌న్‌, న‌డిక‌ర్‌తో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. ఇటీవ‌ల రిలీజైన బ్యాడ్ బాయ్స్ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా నెగెటివ్‌గా క‌నిపించే పాజిటివ్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌టి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం మ‌ల‌యాళం ఐడీ, జాయ్ ఫుల్ ఎంజాయ్‌తో పాటు మ‌రో నాలుగు సినిమాలు చేస్తోన్నాడు.

డైరెక్ట‌ర్‌గా...

యాక్ట‌ర్‌గానే కాకుండా ల‌వ్ యాక్ష‌న్ డ్రామా సినిమాకు ధ్యాన్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గుడ్ఆలోచ‌న‌, 9ఎమ్ఎమ్ సినిమాల‌కు క‌థ‌, స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చాడు. ధ్యాన్‌ శ్రీనివాస‌న్ సోద‌రుడు వినీత్ శ్రీనివాస‌న్ కూడా మ‌ల‌యాళంలో ఫేమ‌స్ యాక్ట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

తదుపరి వ్యాసం