inspirational IAS |అత్తెస‌రు మార్కుల‌తో 10th పాస్‌.. క‌ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీస‌ర్‌!-viral class x marksheet of gujarat ias officer inspires netizens i watch ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Inspirational Ias |అత్తెస‌రు మార్కుల‌తో 10th పాస్‌.. క‌ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీస‌ర్‌!

inspirational IAS |అత్తెస‌రు మార్కుల‌తో 10th పాస్‌.. క‌ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీస‌ర్‌!

Jun 14, 2022 03:41 PM IST HT Telugu Desk
Jun 14, 2022 03:41 PM IST

గుజ‌రాత్ ఐఏఎస్ అధికారి తుషార్ సుమేరా 10వ త‌ర‌గ‌తి మెమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ మార్క్స్ షీట్ చూసిన‌వారు ఎవ‌రైనా.. అది ఒక ఐఏఎస్ అధికారిదంటే క‌చ్చితంగా న‌మ్మ‌రు. ఎందుకంటే.. అందులో మార్క్స్ అలా ఉన్నాయి. మొత్తం 100 మార్కుల‌కు గానూ.. ఇంగ్లీష్లో స‌రిగ్గా పాస్ మార్కులు 35, మాథ్స్ లో అంత‌క‌న్నా ఒక్క‌టి ఎక్కువ 36, సైన్స్ 38. ఇలా అత్తెస‌రు మార్కులు సాధించిన వ్య‌క్తి కూడా ప‌ట్టుద‌ల‌తో కృషి చేస్తే అత్యున్న‌త స్థాయికి ఎద‌గ‌గ‌ల‌రు అన‌డానికి గుజ‌రాత్ భ‌రుచ్ క‌లెక్ట‌ర్‌గా విధుల్లో ఉన్న తుషార్ సుమేరానే మ‌న క‌ళ్ల‌ముందున్న పెద్ద ఉదాహ‌ర‌ణ‌. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లుచేస్తున్న అధికారిగా తుషార్ ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు కూడా అందుకున్నారు. తుషార సుమెరా 10th మార్క్స్ షీట్‌ను మరో ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌నీశ్ శ‌ర‌న్ త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అది కొద్ది సేపట్లోనే వైర‌ల్ అయింది. నెటిజ‌న్ల‌ను ఇన్‌స్పైర్ చేస్తోంది.

More