తెలుగు న్యూస్  /  Entertainment  /  Mahesh Babu Rajamouli Movie Update Ssmb29 Sequel

Mahesh Babu Rajamouli Movie Update: మ‌హేష్‌బాబు సినిమాకు సీక్వెల్‌ ప్లాన్ చేస్తోన్న రాజ‌మౌళి

31 December 2022, 7:08 IST

  • Mahesh Babu Rajamouli Movie Update: మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి సినిమాకు సంబంధించి మ‌రో కొత్త అప్‌డేట్‌ను రివీల్ చేశాడు ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. ఆ అప్‌డేట్ ఏదంటే...

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

మ‌హేష్‌బాబు

Mahesh Babu Rajamouli Movie Update: ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో మ‌హేష్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు రాజ‌మౌళి చాలా సంద‌ర్భాల్లో తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

Guppedantha Manasu Serial: దేవ‌యాని త‌ప్పుకు శైలేంద్ర‌కు శిక్ష - మ‌నుకు షాకిచ్చిన రాజీవ్ - రిషి త‌మ్ముడికి వ‌సు స‌పోర్ట్

Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?

ఇండియానా జోన్స్ త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్‌గా మ‌హేష్‌బాబు సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు రాజ‌మౌళి వెల్ల‌డించాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా మ‌రో అప్‌డేట్‌ను ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రివీల్ చేశాడు. మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి సినిమాను ఫ్రాంచైజ్ మాదిరిగా డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు తెలిపాడు.

ఇందులోని మెయిన్ క్యారెక్ట‌ర్స్‌ను కొన‌సాగిస్తూ సీక్వెల్స్ రూపొందించ‌నున్న‌ట్లు అన్నాడు. ఈ సీక్వెల్స్ అన్నింటిలోనే మ‌హేష్‌బాబు హీరోగా క‌నిపిస్తాడ‌ని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం క‌థ‌కు తుది మెరుగులు దిద్దుతున్న‌ట్లు చెప్పాడు. మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి సినిమా వ‌చ్చే ఏడాది వేస‌వి త‌ర్వాత సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్‌బాబు హీరోగా న‌టిస్తోన్న 29వ సినిమా ఇది.

ఈ సినిమా కోసం మ‌హేష్‌బాబు ఏడాది పాటు డేట్స్ కేటాయించిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌బాబు. జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మూడు నెల‌ల పాటు ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.