తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lust Stories 2 Teaser: బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా రొమాన్స్.. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్.. లస్ట్ స్టోరీస్ 2 టీజర్

Lust Stories 2 Teaser: బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా రొమాన్స్.. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్.. లస్ట్ స్టోరీస్ 2 టీజర్

Hari Prasad S HT Telugu

06 June 2023, 15:22 IST

google News
    • Lust Stories 2 Teaser: బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా రొమాన్స్ చేస్తోంది. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్ చేయడానికి రెడీ అయింది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 టీజర్ మంగళవారం (జూన్ 6) రిలీజైంది.
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా

లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా

Lust Stories 2 Teaser: నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ గుర్తుందా? కొన్నేళ్ల కిందట వచ్చిన ఈ ఆంథాలజీ సంచలనం రేపింది. బూతు సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ లస్ట్ స్టోరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. ఇందులో తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ, కాజోల్, మృనాల్ ఠాకూర్ లాంటి వాళ్లు నటించడం విశేషం. పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ లేదా అంటూ సీనియర్ నటి నీనా గుప్తా నోటితోనే అనిపించారంటే ఈ సిరీస్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా మంగళవారం (జూన్ 6) ఈ లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజైంది. ఇందులో తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో రొమాన్స్ చేయడం చూడొచ్చు. సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ కూడా ఈ సిరీస్ లో ఉంది. ఈ నాలుగు స్టోరీల ఆంథాలజీకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకనాసేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ లస్ట్ స్టోరీస్ 2లో కాజోల్, నీనా గుప్తా, తమన్నాలాంటి సీనియర్ నటీమణులు నటించనుండటం విశేషం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువ జంటకు నీనా గుప్తా ఓ బూతు అడ్వైస్ ఇవ్వడంతో టీజర్ మొదలవుతుంది. కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లే పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా అంటూ ఆమె అనడం విశేషం.

ఈ సిరీస్ లో విజయ్ వర్మతో తమన్నా, అంగద్ బేడీతో మృనాల్ ఠాకూర్ రొమాన్స్ చేయడం చూడొచ్చు. ఇక్కడ లస్ట్ అంటే కామం. తొలి చూపులోనే ఎవరికైనా కామ వాంఛలు పుడతాయా అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ టీజర్ షేర్ చేసింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

లస్ట్ స్టోరీస్ తొలి సీజన్ 2019లో వచ్చింది. ఆ సిరీస్ ను అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ డైరెక్ట్ చేశారు. ఇక అందులో విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పడ్నేకర్, మనీషా కొయిరాలా, రాధికా ఆప్టే, సంజయ్ కపూర్, నేహా ధూపియా, నీల్ భూపాలం నటించారు.

తదుపరి వ్యాసం