తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

New OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

15 December 2022, 6:27 IST

  • New OTT Releases This Week:: ఈ వారం డైరెక్ట్‌గా ఓటీటీ ప్రేక్ష‌కుల్ని కొన్ని సినిమాలు ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. వినూత్న‌మైన క‌థ‌ల‌తో కూడిన సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి.

గోవింద్ నామ్ మేరా
గోవింద్ నామ్ మేరా

గోవింద్ నామ్ మేరా

New OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

గోవింద్ నామ్ మేరా(Govind Naam Mera) - డిసెంబ‌ర్ 16 - డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

విక్కీ కౌశ‌ల్‌, కియారా అద్వాణీ, భూమి ఫ‌డ్నేక‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన గోవింద్ నామ్ మేరా సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబ‌ర్ 16 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌ణ్‌బీర్‌సింగ్ అతిథి పాత్ర‌లో న‌టించాడు.

ఇంటింటి రామాయ‌ణం - డిసెంబ‌ర్ 16 - ఆహా (Aha OTT)

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిన్న సినిమా ఇంటింటి రామాయ‌ణం ఆహా ఓటీటీలో డిసెంబ‌ర్ 16న రిలీజ్ కానుంది. సీనియ‌ర్ న‌రేష్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, న‌వ్య‌స్వామి, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమాకు సురేష్ న‌రెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ద‌ర్శ‌కుడు మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. క‌రీంన‌గ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది.

వాళ్లిద్ద‌రి మ‌ధ్య - డిసెంబ‌ర్ 16 -ఆహా

మ‌న‌సంత నువ్వే ఫేమ్ వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వాళ్లిద్ధ‌రి మ‌ధ్య సినిమా డిసెంబ‌ర్ 16న ఆహా ఓటీటీలో విడుద‌ల‌కానుంది. విరాజ్ అశ్విన్‌, నేహాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. డైరెక్ట్‌గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

కోడ్ నేమ్ తిరంగా - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

ప‌రిణీతి చోప్రా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కోడ్ నేమ్ తిరంగా సినిమా డిసెంబ‌ర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రిబు దాస్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అరియుప్పు - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

ప్రైవేట్ లెస‌న్ - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

ది బిగ్ ఫోర్ - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

ఐ బిలీవ్ ఇన్ సాంట - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

నాని -డిసెంబ‌ర్ 16 - అమెజాన్ ప్రైమ్‌

ది రిక్రూట్ - డిసెంబ‌ర్ 16 -నెట్‌ఫ్లిక్స్‌

అనంత ది ఎట‌ర్నల్ - డిసెంబ‌ర్ 16 - జీ5

ఏ స్ట్రోమ్ ఫ‌ర్ క్రిస్మ‌స్ - డిసెంబ‌ర్ 16 - నెట్‌ఫ్లిక్స్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.